
వర్షం, పిడుగుల బీభత్సం
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆస్తి నష్టం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గురువారం రాత్రి పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. హనుమకొండ జిల్లా నడికూడ మండలం కౌకొండలో రూ.95 వేల విలువైన ఎద్దు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేట గోదావరి శివారు ప్రాంతంలో రూ.10 లక్షల విలువైన 94 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. టేకుమట్ల మండలంలో మానేరులో వరద ఒక్కసారిగా ఉప్పొంగడంతో ట్రాక్టర్లు మునిగిపోగా ఏడుగురిని పోలీసులు రక్షించారు.

వర్షం, పిడుగుల బీభత్సం