
డీసీసీబీ ‘ఏ’ కేటగిరీ సాధించాలి
హన్మకొండ : నాబార్డు ఇన్‌స్పెక్షన్‌లో వరంగల్ డీసీసీబీ ‘ఎ’ కేటగిరీ సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్రాంచ్‌ల వారీగా ప్రగతిని సమీక్షించి ఆయన మాట్లాడారు. నిర్దేశించిన లక్ష్యాలు గడువులోగా సాధించాలని సూచించారు. వ్యక్తిగత పనితీరు మెరుగుపడని వారిపై చర్యలు తీసుకోవాలని సీఈఓను ఆదేశించారు. రుణాలు, మొండి బకాయిలను రికవరీ చేసి సంఘాలను పటిష్టం చేయాలని పేర్కొరు. నిరర్థక ఆస్తులు 2 శాతానికి లోబడి ఉండేలా, టర్నోవర్ రూ.2,500 కోట్లు చేరుకునేలా కృషి చేయాలని అన్నారు. ప్రతి నెల ఖాతాదారులతో సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం వరంగల్ డీసీసీబీని రాష్ట్రంలో రెండో స్థానానికి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో సీఈఓ వజీర్ సుల్తాన్, జీఎంలు ఉషశ్రీ, పద్మావతి, డీజీఎం అశోక్, ఏజీఎంలు మధు, గొట్టం స్రవంతి, బోడ రాజు, గంప స్రవంతి, కృష్ణ మోహన్, డీఆర్ ఓఎస్డీ విజయకుమారి, బ్యాంకు బ్రాంచ్‌ల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.
టెస్కాబ్ చైర్మన్
మార్నేని రవీందర్‌రావు