
కేయూలో తీజ్ ఉత్సవాలు
కేయూ క్యాంపస్: కేయూలో గురువారం ఉత్సాహంగా గిరిజన విద్యార్థులు తీజ్ ఉత్సవాలు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, మహబూబాబాద్ మాజీ ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్, కేయూ పాలకమండలి సభ్యులు బి.సురేశ్‌లాల్, సైన్స్‌విభాగాల డీన్ జి.హనుమంతు, ప్రొఫెసర్ రమేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థి సంఘం నాయకులు మాలోత్ తిరుపతినాయక్, రాజునాయక్, ఉషన్‌నాయక్, రమేశ్‌నాయక్, వెంకట్‌నాయక్, నవ్య, స్నేహ, అనిత, స్వరూప, ధరావత్ సూర్య, యాదగిరి, సురేశ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.