
‘కేరళ అర్బన్ కాన్ క్లేవ్’కు నగర మేయర్
వరంగల్ అర్బన్: కేరళ అర్బన్ కాన్ క్లేవ్–2025 సదస్సుకు గురువారం నగర మేయర్ గుండు సుధారాణి వెళ్లారు. కేరళ అర్బన్ పాలసీ 2025–50లో భాగంగా ‘ఆకాంక్షించే నగరాలు, అభివృద్ధి చెందుతున్న సమాజాలు‘ అనే అంశంపై ఈనెల 12,13 తేదీల్లో కేరళలోని కొచ్చిన్ బోగ్గట్టిలో గ్రాండ్ హాయ్ సదస్సు జరుగనుందని అధికారులు తెలిపారు. స్థిరమైన పట్టణ అభివద్ధిలో వినూత్న అంతర్జాతీయ పద్ధతులు పాటించడం, నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిని సదస్సులో మేయర్ వివరించనున్నారు.
కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం
కేయూ క్యాంపస్: విద్యార్థులు విద్యతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలతో శారీరక దారుఢ్యం మానసికోల్లాసం కలుగుతుందని కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు. గురువారం కేయూలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ, పీజీ కళాశాలల కాలేజీఝెట్ పురుషుల కబడ్డీ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా రిజిస్ట్రార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. క్రీడాపోటీల్లో గెలుపోటములు సహజమని క్రీడాస్ఫూర్తితో క్రీడాపోటీల్లో పాల్గొనాలని ఆయన కోరారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ మాట్లాడుతూ.. మొత్తం 22 టీంలు పాల్గొంటున్నాయని ఈనెల 12న కూడా కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య, ఫిజికల్ డైరెక్టర్లు డాక్టర్ జె.సోమన్న, డాక్టర్ బి.కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.