
ఆర్టీసీలో భద్రతకు పెద్దపీట..
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం రోడ్డు భద్రతకు ప్రాధాన్యమిస్తోంది. రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతోంది. డ్రైవర్ ఆరోగ్యంగా ఉండి, మంచి నడవడిక, ఆరోగ్యకరమైన జీవన శైలి ఉంటే, మానసికంగా దృఢంగా ఉంటారని... తద్వారా ప్రమాదాలు అరికట్టవచ్చనే ఆలోచనతో వరంగల్ రీజియన్ ముందుకు పోతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సేఫ్టీ వార్డెన్లను నియమించారు. ప్రమాదాలు చేయని, అనుభవజ్ఞులు, సత్ప్రవర్తన, ఎలాంటి దురలవాట్లు లేని డ్రైవర్లు, కండక్టర్లను సేఫ్టీ వార్డెన్లుగా ఎంపిక చేశారు. వరంగల్ రీజియన్‌లో 9 డిపోలకు ఒకరి చొప్పున నియమించారు.
సేఫ్టీ వార్డెన్ల విధులు..
సేఫ్టీ వార్డెన్లు డ్రైవర్లను ప్రతీరోజు నిశి త పరిశీలన చేస్తా రు. సెలవులో ఉ న్న వారిని వదిలి పెట్టరు. వారి ఆరోగ్యాన్ని, జీవనశైలిని దగ్గరగా గమనిస్తారు. వారాంతపు సెలవు రోజులు, స్పెషల్ ఆఫ్‌లో ఉన్న సమయంలో తగిన విశ్రాంతి తీసుకుంటున్నారా..? మద్యం సేవిస్తున్నారా..? ఇతర దురలవాట్లకు పాల్పడుతున్నారా.. అనారోగ్యంగా ఉంటే అవసరమైన మందులు సమయానుకూలంగా వాడుతున్నారా.. తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. డ్రైవర్ల కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు తీసుకుని విశ్రాంతి రోజు వారి జీవన విధానాన్ని గమనిస్తున్నారు. వారి నడవడిక, ప్రవర్తనలో ఏ మాత్రం తేడా వచ్చినా డిపో, రీజియన్ అధికారులకు వివరించి సన్మార్గంలో నడిచేలా చూస్తారు. ఇలా చేయడం ద్వారా డ్రైవర్లు ఆరోగ్యంగా ఉంటారని, ఎలాంటి అలజడులకు తావు లేకుండా మానసికంగా ఉంటారని అధికారులు తెలిపారు. వరంగల్ రీజియన్‌లో సంస్థ డ్రైవర్లు 1100, ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్లు 258 మంది ఉన్నారు.
ఉద్యోగులు, కార్మికులకు వైద్య పరీక్షలు..
గ్రాండ్ హెల్త్ చాలెంజ్ కార్యక్రమం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు యాజమాన్యం వైద్య పరీక్షలు నిర్వహించింది. వారి ఆరోగ్యాన్ని బట్టి ఉద్యోగులకను కేటగిరీలుగా విభజించింది. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించింది. హెల్త్ డేటా బేస్‌లో ఉద్యోగి వారీగా ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర సమాచారం పొందుపరిచారు. వైద్య పరీక్షల ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు. మందులు వాడుతున్నారా లేదా అని సేఫ్టీ వార్డెన్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. విధులకు వచ్చిన సందర్భంలోనూ వారి వ్యక్తిగత రికార్డులు పరిశీలించి వాడాల్సిన ఔషధాలు వెంట తెచ్చుకున్నారా లేదా అని తెలుసుకుంటున్నారు. అదేవిధంగా భోజనం, తాగునీరు కూడా ఇంటి వద్ద నుంచి తెచ్చుకునేలా మార్గదర్శనం చేస్తున్నారు. నైట్ డ్యూటీకి వెళ్లే వారు, రెస్ట్‌లో ఉండే వారు దోమతెర, ఓడోమస్ వెంట తీసుకొచ్చేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. తద్వారా డ్రైవర్ల ఆరోగ్యం బాగుండడంతోపాటు రోడ్డు ప్రమాదాలు తగ్గుతున్నాయని అధికారులు తెలిపారు.
వ్యక్తిగత రికార్డుల పరిశీలన..
డ్రైవర్ల పనితీరుపై కూడా వ్యక్తిగత రికార్డులు నిర్వహిస్తున్నారు. డ్రైవర్ ఉద్యోగంలో చేరిన తేదీ, ప్రవర్తన తీరు.. ప్రమాదాలు జరిగాయా.. జరిగితే ప్ర మాదానికి కారణం ఎవరు.. మామూలు ప్రమాదా మా, మేజర్ ప్రమాదమా.. ప్రాణాలుపోయిన ప్ర మాదమా వంటి వివరాలు నమోదు చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సురక్షిత డ్రైవింగ్ చేసే డ్రైవర్లను ‘ఏ’ కేట గిరీలో, మైనర్ ప్రమాదాలు చేసిన వారిని ‘బి’ కేట గిరీ, మేజర్ ప్రమాదాలకు పాల్పడిన వారిని ‘సి’ కే టగిరి, ప్రమాదంలో ప్రాణాలు పోతే ‘డి’ కేటగిరీలో చేర్చారు.
డిపో డ్రైవర్లు
హనుమకొండ 199
వరంగల్–1 286
వరంగల్–2 19
పరకాల 90
జనగామ 172
తొర్రూరు 120
మహబూబాబాద్ 83
నర్సంపేట 121
భూపాలపల్లి 119
డిపోల వారీగా సేఫ్టీ వార్డెన్ల
నియామకం..
ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో సేఫ్టీ వార్డెన్స్‌ను డిపో వారీగా నియమించారు. వరంగల్–1కు ఎంఎం రావు, వరంగల్–2 డిపోకు ఎస్.బాబురావు, హనుమకొండ డిపోకు ఎ.శ్రీనివాస్‌రెడ్డి, జనగామ డిపోకు సురేందర్, పరకాల డిపోకు శంకరయ్య, భూపాలపల్లి డిపోకు రమేశ్, తొర్రూరు డిపోకు యాకూబ్‌రెడ్డి, నర్సంపేట డిపోకు బాబు, మహబూబాబాద్ డిపోకు నర్సయ్యను సేఫ్టీ వార్డెన్లుగా నియమించారు.
డిపోల వారీగా సేఫ్టీ వార్డెన్ల
నియామకం..
ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో సేఫ్టీ వార్డెన్లను డిపో వారీగా నియమించారు. వరంగల్–1కు ఎంఎం రావు, వరంగల్–2 డిపోకు ఎస్.బాబురావు, హనుమకొండ డిపోకు ఎ.శ్రీనివాస్‌రెడ్డి, జనగామ డిపోకు సురేందర్, పరకాల డిపోకు శంకరయ్య, భూపాలపల్లి డిపోకు రమేశ్, తొర్రూరు డిపోకు యాకూబ్‌రెడ్డి, నర్సంపేట డిపోకు బాబు, మహబూబాబాద్ డిపోకు నర్సయ్యను సేఫ్టీ వార్డెన్లుగా నియమించారు.
సేఫ్టీ వార్డెన్స్ ద్వారా నిత్య పరిశీలన
మారుతున్న డ్రైవర్ల జీవన శైలి
తగ్గుతున్న ప్రమాదాలు
వరంగల్ రీజియన్‌లో 9 డిపోలు

ఆర్టీసీలో భద్రతకు పెద్దపీట..