
అంతర్జాతీయ క్రీడా సదస్సుకు డీవైఎస్‌ఓ అశోక్
వరంగల్ స్పోర్ట్స్: నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ సైన్స్ (ఎన్‌ఏపీఈఎస్‌ఎస్) ఆధ్వర్యంలో మలేషియాలో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న మొదటి అంతర్జాతీయ క్రీడా సదస్సులో పాల్గొనేందుకు హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్‌కు ఆహ్వానం అందింది. మలేషియాలోని యూనివర్సిటీ టెక్నాలజీ మారా, షా ఆలంలో మూడు రోజులపాటు జరిగే సదస్సులో అశోక్‌కుమార్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఎన్‌ఎపీఈఎస్‌ఎస్ చైర్మన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజామహ్మద్ ఫిర్హరాజాఅజిదిన్ ఆహ్వాన పత్రికను పంపించారు. కాకతీయ యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్‌పై పీహెచ్‌డీ చేస్తున్న అశోక్‌కుమార్ సెమినార్‌లో పేపర్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.