
పొగాకు ఉత్పత్తులు స్వాధీనం
రామన్నపేట: మట్టెవాడ పీఎస్ పరిధిలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు(అంబర్ ప్యాకెట్లు) విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు వ్యాపారి కొలారియా ముకేశ్ ఇంటిపై టాస్క్ పోలీసులు గురువారం దాడులు చేశారు. ఈ మేరకు రూ.8.82 లక్షల విలువైన అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీధర్, ఎస్సై టి.వీరస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.
13 నుంచి రోలర్
స్కేటింగ్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: అండర్–5 నుంచి 18 బాలబాలికలకు ఈ నెల 13, 14వ తేదీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు స్కేటింగ్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి సిద్ధార్థ, ఓం ప్రకాశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలు 13వ తేదీన ఉనికిచర్లలో ఎస్‌ఎస్‌హౌస్ వద్ద, 14న రాంపూర్‌లోని ఢిల్లీ పబ్లిక్‌స్కూల్ ఆవరణలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు వివరాల కోసం 6301591754 నంబర్‌లో సంప్రదించాలని వారు కోరారు.
13,14వ తేదీల్లో
వాగ్దేవిలో క్రీడాపోటీలు
మామునూరు: ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి క్రీడామైదానంలో ఈనెల 13,14 తేదీల్లో కాకతీయ యూనివర్సిటీ స్థాయి (ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలా బాద్ జిల్లాల) క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల మేనేజ్‌మెంట్, ప్రిన్సిపాల్ సు నీల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీ డా పోటీల్లో 32 కళాశాలకు చెందిన డిగ్రీ, పీజీ , ప్రొఫెషనల్ కోర్సుల క్రీడాకారులు హాజరవుతున్నారని తెలిపారు. క్రీడా పర్యవేక్షకులుగా వాగ్దేవి కళాశాలల కార్యదర్శి సి.హెచ్. దేవేందర్‌రెడ్డి, సి.హెచ్.వాణిదే వి, డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఆర్గనైజర్ సెక్రటరీ రామాంజనేయులు వ్యవహరిస్తారని పేర్కొన్నారు.
‘ఆల్ ఇండియా’ చెస్ పోటీల విజేతగా రామకృష్ణ
వరంగల్ చౌరస్తా: హైదరాబాద్‌లో జరిగిన ఏడో ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్–25 చెస్ పోటీల్లో వరంగల్ జిల్లా సబ్ జైళ్ల జైలర్ గొట్టె రామకృష్ణ విజేతగా నిలిచారు. ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్‌కుమార్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నుంచి మెడల్, ట్రోఫీ అందుకున్నారు. ఈసందర్భంగా ఆ శాఖ అధికారులు, సిబ్బంది, మిత్రులు ఆయనను అభినందించారు.
సకాలంలో టీకాలు వేయాలి
గీసుకొండ: చిన్న పిల్లలకు వేసే టీకాలను సకాలంలో క్రమం తప్పకుండా వేయాలని డీఎంహెచ్‌ఓ సాంబశివరావు వైద్య సిబ్బందికి సూచించారు. జి ల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం వాక్సినేషన్‌పై వైద్య సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రకాశ్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఆచార్య, డాక్టర్ విజయ్‌కుమార్, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్,వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పొగాకు ఉత్పత్తులు స్వాధీనం