
మహాజాతర పనులు సకాలంలో పూర్తి చేయాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారం మహాజాతర అభివృద్ధి పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ దివాకరటీఎస్ అన్నారు. గురువారం మండలంలోని మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్‌లో ఎస్పీ డాక్టర్ శబరీశ్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, డీఎఫ్‌ఓ రాహుల్‌కిషన్ జాదవ్, అడిషనల్ కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావుతో కలిసి మహాజాతర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా చేపట్టనున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర్ టీఎస్ మాట్లాడుతూ పీఆర్, ఆర్‌అండ్‌బీ, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్‌డబ్ల్యూఎస్, రెవెన్యూ, అటవీశాఖ, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించి వారంలోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. ప్రతీ శాఖకు సంబంధించి టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసిన పనులు క్షేత్ర స్థాయిలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో జరిగిన జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. సంబంధిత అధికారులు మేడారంలో క్షేత్ర స్థాయిలో ఉండాలని, పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదిక అందించాలన్నారు. మహాజాతరకు సుమారు కోటి యాభై లక్షల పైగా భక్తులు హాజరవుతారని అంచనా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో జాతర పనులు భక్తులకు సంతృప్తికరంగా ఉండాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ వెంకటేష్, డీఆర్‌ఓ శ్రీనివాస్‌రావు, మేడారం ఈఓ వీరస్వామి, తహసీల్దార్ సురేశ్‌బాబు, అధికారులు పాల్గొన్నారు.
పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి
కలెక్టర్ దివాకరటీఎస్