
ఎఫ్‌ఓబీ నిర్మాణం ఎప్పుడో?
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకోషెడ్ (ఈఎల్‌ఎస్) వద్ద రైల్వే ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు నిర్మిస్తారని రైల్వే కార్మికులు అంటున్నారు. కాజీపేట జంక్షన్‌లో 2004లో రైల్వే శాఖ ఎలక్ట్రిక్‌లోకో మెయిన్ షెడ్ నిర్మించింది. అప్పటి నుంచి రైల్వే అధికారులు, కార్మికులు రైలుపట్టాలు దాటి షెడ్‌కు వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం షెడ్‌లో 250 లోకోల నిర్వహణతో సుమారు 410 మంది రైల్వే కార్మికులు వివిధ సెక్షన్లలో విధులు నిర్వర్తిస్తున్నారు. షెడ్‌లోకి వెళ్లి రావాలంటే రైలు పట్టాలు దాటి వెళ్లాల్సి వస్తోంది. రన్నింగ్ ట్రైన్స్, షట్టింగ్ ట్రైన్స్, డీజిల్‌షెడ్, ఫిట్‌లైన్ నుంచి వచ్చి వెళ్లే రైళ్ల వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు రైల్వే కార్మికులు అంటున్నారు. ఉదయం డ్యూటీకి వెళ్లేటప్పుడు, లంచ్ టైం, డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో రైళ్లు వెళ్లే వరకు గేట్ వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. రైళ్ల రాకపోకలతో విధులకు అంతరాయం ఏర్పడినప్పుడు షెడ్‌లో 8 గంటల పని వేళలో ఆలస్యం కావడం వల్ల పని భారం పడుతోందని రైల్వే ట్రేడ్ యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో షెడ్ వద్ద ఆర్‌యూబీ మంజూరైందని, ఏమైందో ఏమో గాని రద్దు కూడా అయిందని అంటున్నారు. షెడ్ కార్మికుల కోసం ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని రైల్వే జీఎం, డీఆర్‌ఎం, పీఎన్‌ఎం మీటింగ్‌తోపాటు రైల్వే బోర్డు స్థాయి వరకు వెళ్లిందని చెబుతున్నారు. ఇప్పటికై నా రైల్వే శాఖ బ్రిడ్జిని నిర్మించాలని షెడ్ రైల్వే నాయకులు, కార్మికులు కోరుతున్నారు.
ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ లోకోషెడ్
రైల్వే కార్మికులు