
రోబోటిక్స్ సైన్స్ వర్క్‌షాప్ రిపోర్ట్ అందజేత
న్యూశాయంపేట: నర్సంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో ఇటీవల నిర్వహించిన రోబోటిక్స్ సైన్స్ వర్క్‌షాప్ రిపోర్ట్‌ను ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ గురువారం కలెక్టర్ సత్యశారదకు అందజేశారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసిన కలిసిన నవీన్.. కళాశాలలో తరగతి గదుల నిర్మాణం, కంప్యూటర్ ల్యాబ్, క్రీడా సౌకర్యాల కల్పనకు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో వర్క్‌షాప్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు బి.సత్యనారాయణ, కందాల సత్యనారాయణ, రుద్రాణి, వి.పూర్ణచందర్ పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన జీపీఓలు
న్యూశాయంపేట: ఇటీవల నియమితులైన గ్రామపంచాయతీ ఆఫీసర్(జీపీఓ)లు గురువారం కలెక్టర్ సత్యశారదను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. జిల్లాలో జీపీఓ కౌన్సెలింగ్‌లో ఎటువంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా నిర్వహించి పోస్టింగ్‌లు ఇచ్చినందుకు కలెక్టర్, అదనపు కలెక్టర్, ఏఓ తదితర అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో బి.శ్రీనివాసులు, ఏ.శ్రీకాంత్, విజయజ్యోతి, జ్యోతి, రమేష్, శ్రావణ్, క్రాంతి, విశ్వేశ్వర్, సుభాష్ తదితరులు ఉన్నారు.