
ఎన్నికల హామీలు నెరవేర్చాలి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నాగయ్య
న్యూశాయంపేట: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లాకమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగయ్య పాల్గొని, మాట్లాడుతూ.. వరంగల్ నగరంలోని 30 సెంటర్లలో పేదలు గుడిసెలు వేసుకుని అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్నారని తెలిపారు. అనంతరం కలెక్టర్ సత్యశారదకు వినతిపత్రం, ప్రజల దరఖాస్తులను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ బషీర్, వలదాసు దుర్గయ్య, సాంబమూర్తి, ప్రశాంత్, రమేష్, దివ్య, వాణి, ఆలం, గాలయ్య, భవాని, విజయ తదితర నాయకులు పాల్గొన్నారు.