
ఉపాధి శిక్షణతో ఆర్థికాభివృద్ధి
హన్మకొండ: మహిళల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు ఉపాధి శిక్షణ దోహదపడుతుందని హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్‌పాండే అన్నారు. బుధవారం హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్‌లో మహిళా సాధికారత మేళా కార్యక్రమం జరిగింది. మగ్గం శిక్షణ, టైలరింగ్, బ్యూటిషన్ ట్రైనింగ్ పొందిన 350 మంది మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఉపాధి శిక్షణతో కుటుంబం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందన్నారు. అడిషనల్ డీసీపీ రవి, ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ, సంస్థ రీజినల్ అధ్యక్షులు రుమాల్డిన, ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ఎర్ర శ్రీకాంత్, బత్తుల కరుణ, ఆయా సంస్థల ప్రతినిధులు అనితారెడ్డి, కె.నాగవాణి, ఆల్బటా అమృత, ఎం,అజయ్‌కుమార్, ఈసంపల్లి సుదర్శన్, పరికి సుధాకర్, సుదర్శన్ గౌడ్, ప్రభాకర్, శివప్రసాద్, కొమ్ముల నవీన్ పాల్గొన్నారు.