
డెంగీతో చిన్నారి మృతి
లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం వనపర్తి గ్రా మానికి చెందిన కౌడె ఉపేందర్, అనిత దంపతుల కూతురు సంహిత(07) బుధవారం హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికి త్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలి పారు. ఉపేందర్, అనిత దంపతులు జనగామలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల గ్రామంలో బోనాలు, ఇతర పండుగలు రావడంతో అనిత స్వగ్రామం కోడూరుకు, అత్తగారిల్లు వనపర్తికి వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో సంహితకు పదిహేను రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు, అనంతరం చంపక్‌హిల్స్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు తరలించగా డెంగీ అని నిర్ధారణ అయ్యింది. దీంతో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చిన్నారి సంహిత మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషయంపై స్థానిక వైద్యురాలు స్వర్ణలతను వివరణ కోరగా ఆ కుటుంబం జనగామలో నివాసం ఉంటోందని తెలిపారు.