
సాహితీవేత్త రంగారావు మృతి
విద్యారణ్యపురి: అనారోగ్య సమస్యలతో కవి, కథకుడు, వ్యాసకర్త సంధ్య రంగారావు (82) బుధవారం హైదరాబాద్‌లో మరణించారని కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, కార్యదర్శి వీఆర్‌విద్యార్థి తెలిపారు. కాళోజీ సోదరులు స్థాపించిన మిత్రమండలికి సుమారు 12 ఏళ్లపాటు రంగారావు కన్వీనర్‌గా సేవలందించారని గుర్తుచేశారు. ఆయన మృతిపై కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్, పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, గంట రామిరెడ్డి, ప్రొఫెసర్ బన్న అయిలయ్య, పందిళ్ల అశోక్‌కుమార్, డాక్టర్ ఆగపాటి రాజ్‌కుమార్ సంతాపం తెలిపారు.