
దానాపూర్ రైలుకు చర్లపల్లిలో హాల్టింగ్
కాజీపేట రూరల్ : ప్రయాణికుల సౌకర్యార్థం దీపావళి, దసరా, చాత్‌పూజా పండుగల సందర్భంగా కాజీపేట జంక్షన్ మీదుగా వెళ్లే సికింద్రాబాద్–దానాపూర్ డైలీ ఎక్స్‌ప్రెస్‌కు చర్లపల్లిలో తాత్కాలికంగా హాల్టింగ్ కల్పించినట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 10 రోజులపాటు పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లిలో హాల్టింగ్ కల్పించినట్లు తెలిపారు.
హాల్టింగ్ వివరాలు..
సికింద్రాబాద్–దానాపూర్ (12791) ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్‌లో 9: 25 గంటలకు బయలుదేరి చర్లపల్లికి 9:40 గంటలకు, కాజీపేటకు 11:08 గంటలకు చేరుతుంది. అదేవిధంగా దానాపూర్–సికింద్రాబాద్ (12792) ఎక్స్‌ప్రెస్ దానాపూర్‌లో బయలుదేరి మరుసటి రోజు కాజీపేటకు 18:23 గంటలకు, చర్లపల్లికి 20:42 గంటలకు, సికింద్రాబాద్‌కు 21:30 గంటలకు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు.
నేడు నాలుగు ప్యాసింజర్ రైళ్లు రద్దు..
కాజీపేట రూరల్ : కాజీపేట–విజయవాడ మార్గంలో నెక్కొండ–కేసముద్రం–మహబూబాబాద్ మ ధ్య చేపడుతున్న థర్డ్ లైన్ కమిషనింగ్ ఎన్‌ఐ వర్క్స్ కారణంగా గురువారం పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ బుధవారం తెలిపారు.
నేడు రద్దయ్యే రైళ్ల వివరాలు..
కాజీపేట–డోర్నకల్ (67765) ప్యాసింజర్, డోర్నకల్–కాజీపేట (67766) ప్యాసింజర్, డోర్నకల్–విజయవాడ (67767) ప్యాసింజర్, విజయవాడ–డోర్నకల్ (67768) ప్యాసింజర్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
పాక్షికంగా రద్దు..
భద్రాచలం రోడ్–బల్లార్షా (17033) సింగరేణి ప్యాసింజర్‌ను భద్రాచలంరోడ్–కాజీపేట మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు సీపీఆర్వో తెలిపారు.
పండుగల రద్దీ దృష్ట్యా
10 రోజులపాటు అమలు..