
మాడవీధుల నిర్మాణ పనుల పరిశీలన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని బుధవారం సాయంత్రం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు. ఆమ్మవారిని దర్శించి పూ జలు చేసిన అనంతరం అర్చకులు శేషవస్త్రాలు, మ హదాశీర్వచనం అందజేశారు. అనంతరం మాడవీధుల పురోగతిని ‘కుడా’ అధికారులతో చర్చించి పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల నుంచి మాడవీధి గుండా ప్రవేశం మార్గం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అడ్డంగా ఉన్న నిర్మాణాలను తొలగించి నవరాత్రులకు రెండు రోజుల ముందుగానే ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయం ముందు ఉన్న, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. అనంతరం బతుకమ్మ పండుగను పురస్కరించుకుని వేయిస్తంభాల దేవాలయాన్ని ఆమె సందర్శించారు. బతుకమ్మ వేడుకల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఆమె వెంట ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, ఆలయ చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం, ఆలయ అర్చకులు భద్రకాళి శేషు, ‘కుడా’ అధికారులు అజిత్‌రెడ్డి, భీంరావు, ఆర్డీఓ రమేశ్, వరంగల్ ఏసీపీ సత్యనారాయణ, మట్వాడ సీఐ కరుణాకర్, తహసీల్దార్ రవీందర్ ఉన్నారు.