
బెల్ట్‌షాపులపై దాడులు
ఖిలా వరంగల్: వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో వరంగల్ ఏఎస్పీ శుభం ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేష్ బుధవారం బెల్ట్‌షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ మేరకు రూ.12 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుని, బెల్ట్‌షాపు నిర్వాహకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. తెల్లవార్లు బెల్ట్‌షాపులు కొనసాగించడం వల్ల నిత్యం గొడవలు జరుగుతున్నాయని, పద్ధతి మార్చుకోకుంటే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ శుభం హెచ్చరించారు.
హసన్‌పర్తి: కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధి గుండ్లసింగారంలోని ఎస్సారెస్పీ కాల్వకట్టతో పాటు పెగడపల్లి డబ్బాల ప్రాంతాల్లోని బెల్ట్‌షాపులపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు రూ.25 వేల మద్యంతోపాటు రూ.5 వేల విలువైన గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో హనుమకొండ ఏసీపీ నర్సింహరాములు స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, ఎస్సైలు రవీందర్, శ్రీకాంత్, కల్యాణ్, నవీన్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.