
మైసూరును తలపించేలా ఉత్సవాలు నిర్వహిద్దాం
● మంత్రి కొండా సురేఖకు రంగలీల మైదానం దసరా ఉత్సవ కమిటీ వినతి
ఖిలా వరంగల్: రంగలీల మైదానంలో జరిగే సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలను మైసూరు ఉత్సవాలను తలపించేలా నిర్వహించుకుందామని మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం దసరా ఉత్సవ కమిటీ సభ్యులు వరంగల్ ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సురేఖను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి కొండా సురేఖకు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. రంగలీల మైదానంలో నిర్వహించే సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని కోరుతూ మంత్రికి కమిటీ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. వచ్చే నెల 2న రంగలీల మైదానంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలకు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో దసరా ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు గోపాల నవీన్‌రాజు, కమిటీ అధ్యక్షుడు ఎన్.సంజయ్‌బాబు, ప్రధాన కార్యదర్శి మేడిది మధుసూదన్, ఉపాధ్యక్షుడు గోనే రాంప్రసాద్, కమిటీ ప్రతినిధులు వెంకటేశ్వర్లు, వేణు, అఖిల్‌గౌడ్, అజయ్, మహేశ్, శ్రీను, గోవర్ధన్, సంతోశ్, మధు, రంజిత్, వంశీ, రమేశ్, మనోహర్, కృష్ణ, చరణ్, శ్రీధర్, నరేందర్, అరుణ్, సాయి, రాజశేఖర్, క్రాంతి, అక్తర్, కిషోర్ పాల్గొన్నారు.