
‘అబాస్’ హాజరు విధానాన్ని రద్దు చేయాలి
ఎంజీఎం: క్షేత్రస్థాయి ఆరోగ్య పర్యవేక్షణ సిబ్బందికి అబాస్ (బయో మెట్రిక్ హాజరు) విధానాన్ని రద్దు చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య పర్యవేక్షణ సిబ్బంది జిల్లా జేఏసీ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్యను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్కో పీహెచ్‌సీ పరిధిలో 4 నుంచి 13 ఉపకేంద్రాలు ఉన్నాయని, వాటిలో పీహెచ్‌సీకి వెళ్లి బయోమెట్రిక్ హాజరు నమోదు చేసుకుని ఫీల్డ్‌కు వెళ్లాలంటే కనీసం 10 నుంచి 20 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోందని పేర్కొన్నారు. 24 గంటలు అత్యవసర సేవల్లో ఉండే క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందిని పీహెచ్‌సీ కార్యాలయంలోని సిబ్బంది, పర్యవేక్షణ సిబ్బందితో జతకట్టి చూడొద్దని కోరారు. ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బంది అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు నిర్విరామంగా, నిరంతరాయంగా సమయపాలన లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్రస్థాయి సిబ్బందికి అబాస్ నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బానోతు నెహ్రూ చంద్‌నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీరం మధుసూదన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు తోకల మాధవరెడ్డి, హెల్త్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ నాయకులు కత్తి రవీందర్, కె.రమేష్, జ్యోతి, సులోచన, ప్రసన్నకుమారి, శ్రీకాంత్, రాజేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.