
క్యాన్సర్ కేర్ సెంటర్ ప్రారంభం
ఎంజీఎం : వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో హనుమకొండ, వరంగల్ జిల్లాల ప్రజల కోసం పది పడకల సామర్థ్యంతో క్యాన్సర్ కేర్ సెంటర్‌ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా మంగళవారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీ ణ, పట్టణవాసులకు క్యాన్సర్ చికిత్సను సమీప ప్రాంతంలో అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసిందన్నారు. వివిధ జిల్లాలకు చెందిన రోగులు ప్రాథమిక క్యాన్సర్ నిర్ధారణ అనంతరం కిమోథెరఫి సేవలను హైదరాబాద్ వంటి దూరప్రాంతాలకు వెళ్లకుండానే స్థానికంగా పొందుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంజీఎం అధికారులు తదితరులు పాల్గొన్నారు.