
ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తాం..
ఖిలా వరంగల్: వరంగల్ జిల్లాలోని 509 రేషన్ దు కాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం తరలింపునకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేద ని, ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి తరలింపునకు చర్యలు తీసుకుంటామని అదనపు జిల్లా కలెక్టర్ సంధ్యరాణి, జిల్లా పౌర సరఫరాల అధికారి తెలి పారు.‘దొడ్డు బియ్యం ఎలుకల పాలు’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ఈనెల 6 న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా వ్యాప్తంగా 509 రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయని, ప్రభుత్వ ఆదేశాల మేరకు బియ్యం తరలింపునకు చర్యలు తీసుకుంటామన్నారు.
అధికార పార్టీ నాయకుడు, తహసీల్దార్‌పై కేసు
● ఉద్యోగి ఆత్మహత్యాయత్నం ఘటనపై పోలీసుల విచారణ
నల్లబెల్లి : ఉద్యోగి ఆత్మహత్యాయత్నం ఘటనలో అధికార పార్టీ నాయకుడు మాలోత్ చరణ్‌సింగ్, తహసీల్దార్ ముప్పు కృష్ణపై మంగళవారం కేసు నమోదైంది. ఎస్సై గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్ శివారు బజ్జుతండాకు చెందిన వాంకుడోత్ కల్పన తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. అధికారి అండదండలతో బిల్‌నాయక్ తండాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మాలోత్ చరణ్‌సింగ్ లైంగికంగా వేధిస్తూ, కార్యాలయానికి వస్తూ చంపుతానని ఆమెను బెదిరించేవాడు. ఈనెల 5న పలు తప్పుడు ఆరోపణలతో కల్పనపై చరణ్‌సింగ్ కలెక్టర్‌కు ఫిర్యా దు చేసినట్లు మేడపల్లి మాజీ ఎంపీటీసీ భర్త మాలోత్ మోహన్ ఆమెకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాడు. చరణ్‌సింగ్ వేధింపులు, త ప్పుడు ఆరోపణలపై కల్పన సోమవారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించింది. దీంతో నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇప్పటికై నా చరణ్‌సింగ్‌తో బయట వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలని తహసీల్దార్ దురుసుగా సమాధానం చెప్పి బయటకు వెళ్లగొట్టా డని ఎస్సై తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన కల్పన కార్యాలయంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి భర్త ధూప్‌సింగ్ ఫిరా ్యదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.