
కేఎంసీకి పార్థివదేహం అప్పగింత
ఎంజీఎం: నగరంలోని అడ్వకేట్స్ కాలనీ సంతోష్‌నగర్‌కు చెందిన సముద్రాల ప్రమీల (84) మంగళవారం మృతి చెందింది. ప్రమీల పార్థివదేహాన్ని ఆమె కుమార్తెలు అనిత, కవిత, కుమారుడు విజయగోపాల్ కాకతీయ వైద్య కళాశాల సిబ్బందికి అప్పగించారు. అనాటమీ ప్రొఫెసర్ డాక్టర్ శశికాంత, అనాటమీ విద్యార్థులు, సిబ్బంది ప్రేమ్‌కుమార్, యాదగిరి, ప్రణయ్ తదితరులు పార్థివ దేహాన్ని అనాటమీ విభాగానికి తరలించారు. ఈ సందర్భంగా అనాటమీ విభాగం డాక్టర్ శశికాంత మాట్లాడుతూ శరీర దానం వైద్యవిద్యార్థుల పరిశోధనకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. శరీరదానం చేసిన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అనంతరం నేత్ర అవయవ, శరీర దాతల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పెండ్లి ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ మరణానంతరం నేత్ర, అవయవ, శరీర దానానికి ముందుకు రావాలని కోరారు. మరిన్ని వివరాలకు 87905 48706, 94901 33650 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. అడ్వకేట్ తిరుమల, సునీత, రమాదేవి, లింగారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, అ సోసియేషన్ ఉపాధ్యక్షురాలు మునిగాల పద్మ, హనుమకొండ జిల్లా అధ్యక్షులు పరికిపండ్ల వేణు, కా ర్యదర్శి సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షులు మొహీనుద్దీన్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.