
ఉద్యమ ధ్వజం..
అక్షరాలను అగ్ని కణాలుగా
విరజిమ్మావు..
అఖిలాండంలోని అనాథలగాథలను
వినిపించావు
అణగదొక్క గర్జించావు
అధికారం ముసుగులో
కాళికవై కదిలావు
ప్రశ్నించేతత్వానికి ప్రహ్లాదుడే
గురువని ప్రవచించావు
ఉప్పెనలా ఎగిసిపడే ఉద్యమాలకెన్నిటికో
ఊపిరిగా నిలిచావు
ప్రజల భాషలో ప్రజల గొడవకు
పట్టం కట్టావు
నిర్మోహ్మటం, నిజాయతీలనే
త్రికరణశుద్ధిగా పాటించావు
సామాన్యుడిగా ఉంటూనే సాహసంతో
సత్యాగ్రహిగా బతికావు
తెలంగాణ పోరు తేరుపై
‘ఉద్యమ ధ్వజం’గా మిగిలావు
– కాళోజీ జయంతి
సందర్భంగా పాలకుర్తికి
చెందిన ప్రముఖ
సాహితీవేత్త డాక్టర్
శంకరమచి శ్యాంప్రసాద్.
(9989148305)
–పాలకుర్తి టౌన్