నేత్రదానంపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

నేత్రదానంపై అవగాహన ఉండాలి

Sep 9 2025 6:42 AM | Updated on Sep 9 2025 2:27 PM

ఎంజీఎం : నేత్రదానం చేసి మరణానంతరం కూడా జీవించాలని, ప్రతీ ఒక్కరికి నేత్రదానంపై అవగాహన ఉండాలని కేఎంసీ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మీపతి పేర్కొన్నారు. 40వ నేత్రదాన పక్షోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం కేఎంసీ నుంచి ప్రభుత్వ ప్రాంతీయ నేత్రవైద్యశాల వరకు నిర్వహించిన ర్యాలీని లక్ష్మీపతి జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.ఆర్‌ భరత్‌కుమార్‌, శ్రీకుమార్‌, హరిదేవ్‌, ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, పీజీ డాక్టర్లు, ఆప్టోమెట్రి, బీఎస్సీ, జీఎన్‌ఎం నర్సింగ్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి 

వరంగల్‌ క్రైం: ఈనెల 13న నిర్వహించే జాతీ య మెగా లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వి నియోగం చేసుకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోక్‌ అదాలత్‌లో క్రిమి నల్‌, సివిల్‌, ఆస్తి, కుటుంబ, వైవాహిక జీవిత, బ్యాంక్‌ రికవరీ, విద్యుత్‌ చౌర్యం, చెక్‌ బౌన్స్‌, తదితర కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకొని కోర్టు చుట్టూ తిరుగుతూ విలువైన సమయం, డబ్బులను వృథా చేసుకోవద్దని పేర్కొన్నారు. కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు, ఇతర పోలీస్‌ సిబ్బంది రాజీపడ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సెలింగ్‌ చేసి రాజీపడేలా అవగాహన కల్పిస్తారని వివరించారు. లోక్‌ అదాలత్‌ ద్వారా బాధితులకు సత్వర న్యా యం జరుగుతుందని, రాజీపడదగే వారు పో లీస్‌ అధికారులను సంప్రదించాలని కోరారు.

తరగతి గదిలో టీఎల్‌ఎంలు వినియోగించాలి: హనుమకొండ డీఈఓ వాసంతి

విద్యారణ్యపురి : తరగతిగదిలో విద్యార్థులకు బోధించేటప్పుడు టీఎల్‌ఎంలను (కృత్యాధార పద్ధతులు) వినియోగించాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి పేర్కొన్నారు. సోమవారం హనుమకొండలోని లష్కర్‌బజార్‌ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి టీఎల్‌ఎం మేళాను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు రెడీమెడ్‌గా తయారుచేసిన టీఎల్‌ఎంలు కాకుండా వారే సొంతంగా తయారు చేసుకోవాలని సూచించారు. 

14 మండలాల నుంచి 140మంది ఉపాధ్యాయులు టీఎల్‌ఎం చార్టులను ప్రదర్శించారు. ప్రదర్శనలోని టీఎల్‌ఎంల నుంచి తెలుగు ఉర్దూ, ఇంగ్లిష్‌ భాషలో మూడు, గణితంలో రెండు, ఈవీఎస్‌లో ఒకటి రాష్ట్రస్థాయి మేళాకు ఎంపికయ్యాయి. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్‌ బండారు మన్మోహన్‌, ఎంఈఓ నెహ్రూ నాయక్‌, జిల్లా సైన్స్‌ అధికారి ఎస్‌.శ్రీనివాసస్వామి, వేణుఆనంద్‌, మధుసూదన్‌ రెడ్డి, ఎం.సోమయ్య, కేశవరావు, అశోక్‌కుమార్‌, వెంకట్‌రామ్‌రెడ్డి పాల్గొన్నారు. డీఈఓ వాసంతి ఆయా ఉపాధ్యాయులకు ప్రశంసపత్రాలు అందజేశారు.

కేఎంసీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు

ఎంజీఎం : కాకతీయ మెడికల్‌ కళాశాలకు.. ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ సంధ్య అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారు. ఉస్మానియా, గాంధీ, కాకతీయ అండ్‌ తెలంగాణ మెడికల్‌ అలూమ్ని వార్షిక మహాసభ–2025 (ఓజీకేటీఎంఏ) అమెరికాలోని కెంటకీ లూయిస్వీల్‌ మారియట్‌ ఈస్ట్‌లో ఈనెల 6వ తేదీన నిర్వహించారు. ఇందులో భాగంగా డాక్టర్‌ సుంకరనేని సంధ్య క్రిటీ–2025 (కాకతీయ రీసెర్చీ ఇన్సెటివ్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫర్మెటివ్‌ ఇన్నోవేషన్‌) పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్య కేఎంసీ అభివృద్ధికి అల్యూమ్ని చేస్తున్న సహకారాన్ని అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ అవకాశాల కోసం విద్యార్థులకు ఎన్‌ఆర్‌ఐ పూర్వ విద్యార్థుల మెంటర్‌షిప్‌ అవసరాన్ని వివరించారు. ఈ ప్రతిపాదనలకు ఎన్‌ఆర్‌ఐ అల్యూమ్ని పూర్తి మద్దతు ప్రకటించి కళాశాల అభివృద్ధి తోడ్పాడుతామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

నేత్రదానంపై అవగాహన ఉండాలి1
1/1

నేత్రదానంపై అవగాహన ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement