
అభ్యంతరాలు ఉంటే తెలపాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్ : జిల్లాలోని 12మండలాల్లో గ్రామ పంచాయతీల వారీగా ముసాయిదా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో వారితో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి 10వ తేదీన ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ రవి సమాధానమిచ్చారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ.వి శ్రీనివాసరావు, శ్యామ్‌సుందర్, ప్రభాకర్‌రెడ్డి, సయ్యద్ ఫైజుల్లా, నిశాంత్, రజనీకాంత్, ఎండీ నేహాల్, ఇండ్ల నాగేశ్వర్‌రావు, ప్రవీణ్‌కుమార్, జయంత్‌లాల్, తదితరులు పాల్గొన్నారు.
17నుంచి స్వస్థ్ నారీ,
సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాలు..
మహిళల ఆరోగ్యమే ధ్యేయంగా ఈనెల 17వ తేదీనుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడంపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మహిళలకు నిర్దేశించిన ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులతో అన్ని రకాల పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డీఎంహెచ్‌ఓ అప్పయ్య, జెడ్పీ ఇన్‌చార్జ్ సీఈఓ రవి, డీపీఓ లక్ష్మీరమాకాంత్, డీఈఓ వాసంతి, డీడబ్ల్యూఓ జయంతి, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ నిర్మల, అధికారులు పాల్గొన్నారు.
రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీల తుది జాబితా
న్యూశాయంపేట: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈనెల 10న(బుధవారం) వెలువరించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 10న తుది జాబితా వెలువరిస్తామని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సీఈఓ రామిరెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

అభ్యంతరాలు ఉంటే తెలపాలి