
ఆలయాల మూసివేత
హన్మకొండ కల్చరల్: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా వేయిస్తంభాల దేవాలయాన్ని ఆదివారం మధ్యాహ్నం ద్వారబంధనం చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్భలు వేసి ద్వారబంధనం చేశారు. తిరిగి సోమవారం తెల్ల వారుజామున ద్వారాలు తెరిచి సంప్రోక్షణ చేసి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ఆలయ ఈఓ అనిల్‌కుమార్ తెలిపారు. అదేవిధంగా భద్రకాళి ఆలయంలో మధ్యాహ్నం ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ద్వారబంధనం చేశారు. కార్యక్రమంలో సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.
ఐలోని ఆలయం మూసివేత
ఐనవోలు: చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయాన్ని మూసివేశారు. సోమవారం ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ చేసిన అనంతరం భక్తులకు స్వామి వారి దర్శనాన్ని కల్పించనున్నట్లు ఆలయ ఈఓ కందుల సుధాకర్ తెలిపారు.

ఆలయాల మూసివేత