
‘ఇందిరమ్మ’ ఇటుకలకు వచ్చి..
మద్యం మత్తులో డ్రైవర్..!
భూపాలపల్లి అర్బన్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బాంబులగడ్డ జాతీయ ప్రధాన రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపక్కన ఆగి ఉన్న బైక్‌ను ఎదురుగా వస్తున్న టాటాఏస్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందారు. చిట్యాల మండలం భావుసింగ్‌పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సిమెంట్ ఇటుకలు కొనుగోలు చేసేందుకు వచ్చి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. సీఐ నరేష్‌కుమార్, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. భావుసింగ్‌పల్లికి చెందిన కొడపాక నర్సయ్య (50), కాల్వల సంజీవ్ (38) శుక్రవారం మధ్యాహ్నం భూపాలపల్లికి ద్విచక్ర వాహనంపై వచ్చి బాంబులగడ్డ సమీపంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకల ప్లాంట్‌కు వెళ్లి ధర మాట్లాడుకొని తిరిగి రోడ్డుకి చేరుకున్నారు. ఈక్రమంలో కాళేశ్వరం వెళ్లి భూపాలపల్లి వైపు వస్తున్న టాటాఏస్ వాహనం రోడ్డుకు ఎడమ వైపు నుంచి కుడి వైపునకు దూసుకు వచ్చింది. రోడ్డు పక్కనే ఆగి ఉన్న బైక్‌తో పాటు ఇరువురిని ఢీకొట్టింది. దీంతో వారికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. తలకు, శరీరం లోపల బలమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోలీసులు టాటాఏస్ వాహనం హనుమకొండ జిల్లా కమలాపూర్‌దిగా గుర్తించారు. మృతుడు నర్సయ్యకు కుమారుడు, భార్య, సంజీవ్‌కు ఇద్దరు కూతుళ్లు, భార్య ఉన్నారు. బాధిత కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మార్చురీకి వెళ్లి పరామర్శించారు.
రోడ్డు ప్రమాదంలో ఇరువురు దుర్మరణం
చిట్యాల మండలం
భావుసింగ్‌పల్లిలో విషాదం
కమలాపూర్ గ్రామానికి చెందిన టాటాఏస్ వాహనంలో వినాయకుడి విగ్రహాన్ని కాళేశ్వరంలో నిమజ్జనం చేసి వస్తున్నారు. మార్గమధ్యలో మద్యం తాగినట్లు తెలిసింది. మద్యం మత్తులో డ్రైవర్ వాహనం నడుపుతుండగా అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే డ్రైవర్‌తో పాటు వాహనంలో ఉన్నవారు పరారయ్యారు. ప్రమాదానికి గురైన వాహనాలను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

‘ఇందిరమ్మ’ ఇటుకలకు వచ్చి..