
శాంతిమార్గం చూపిన మహ్మద్ ప్రవక్త
కాజీపేట రూరల్: శాంతి మార్గం చూపే మహ్మద్ ప్రవక్త దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా పీఠాధిపతి, తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా అన్నారు. కాజీపేట దర్గా ప్రాంగణంలో శుక్రవారం మిలాద్ ఉన్ నబీ–మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మక్కా నుంచి తీసుకొచ్చిన ప్రవక్త దుస్తులు, తల వెంట్రుకలను భక్తుల సందర్శనను ఖుస్రూపాషా ప్రారంభించారు. ఈసందర్భంగా ఖుస్రుపాషాను ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సుమారు 6 వేల మంది భక్తులు, ప్రజలకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తియార్ బియాబానీ, మాజీ కార్పొరేటర్ మమ్మద్ అబుబక్కర్, సయ్యద్ రజాలి, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
సర్వమానవాళిని కాపాడుతూ..
ఖిలా వరంగల్: సర్వ మానవాళిని కాపాడేందుకు ప్రవక్త శాంతి సందేశమిచ్చారని ఉర్సు దర్గా పీఠాధిపతి నవీద్‌బాబా, తవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఎంఏ జబ్బార్ అన్నారు. మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా శుక్రవారం వరంగల్ ఫోర్ట్ రోడ్డులోని ఈద్గా మైదానంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు నిర్వహించారు. భారీ జెండాను ఊరేగించి ఈద్గా మసీద్‌లో ప్రతిష్ఠించారు. మతాలకు అతీతంగా వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. అనంతరం మహా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉబేద్ బాబా, ఎండీ చాంద్‌పాషా, మహ్మద్ ముగ్దుం తదితరులు పాల్గొన్నారు.
దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా
ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు

శాంతిమార్గం చూపిన మహ్మద్ ప్రవక్త