
మాస్టర్ ప్లాన్ ప్రకారం సౌకర్యాలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మాస్టర్ ప్లాన్ ప్రకారం మేడారంలో వనదేవతల గద్దెల ప్రాంగణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీష్ శుక్రవారం పరిశీలించారు. నూతన మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా భక్తుల సౌకర్యార్థం చేపట్టనున్న ఏర్పాట్లపై క్షుణ్ణంగా పర్యవేక్షించారు. సమ్మక్క–సారలమ్మ గద్దెల వరుస క్రమంలో పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల ఏర్పాటు స్థలాన్ని, వనదేవతలను భక్తులు సులువుగా దర్శించుకునేలా ఈసారి కొత్త క్యూలైన్ల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై పోలీసుల భద్రతతోపాటు వీఐపీ, వీవీఐపీల ఎంట్రి తదితర ఆంశాలపై చర్చించారు. ఈసారి నిర్వహించే మహాజాతర వరకు గద్దెల ప్రాంగణంలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు అఽ దికారులు కసరత్తు చేస్తున్నారు. ఈఓ వీరస్వామి, డీ ఎస్పీ రవీందర్, డీఈ రమేశ్‌బాబు, పస్రా సీఐ దయాకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వరుస క్రమంలో వనదేవతల గద్దెల మార్పుపై పరిశీలన
మేడారంలో పర్యటించిన కలెక్టర్, ఎస్పీ