
విద్యార్థుల భవిష్యత్ గురువుల చేతుల్లోనే..
‘ఉత్తముల’ ఎంపికలో
పారదర్శకత ఏది?
8
లోu
విద్యారణ్యపురి: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదేనని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. శుక్రవారం గురుపూజోత్సవం సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్‌లో ఎంపికై న వివిధ కేటగిరీల టీచర్లు 62మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి ప్రదానం చేశారు. శాలువా కప్పి సన్మానించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బండా ప్రకాశ్ మాట్లాడుతూ సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ పదవిలో తనలాంటి వారు నిలబడటానికి తనకు విద్యాబుద్ధులు నేర్పి వారి విజ్ఞానాన్ని పంచిన గురువులే కారణమన్నారు. కలెక్టర్ స్నేహ శబరీస్ మాట్లాడుతూ టీచర్లలో బెస్ట్ అని ఆర్డనరీ అంటూ ఉండరని, తన దృష్టిలో అందరూ ఉత్తమ టీచర్లనేనన్నారు. విద్యతోనే విద్యార్థుల జీవితాల్లో మార్పు వస్తుందన్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరినీ ఉత్తములుగా ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. డీఈఓ డి.వాసంతి మాట్లాఉడతూ విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమను తాము మార్పుకోవాలన్నారు. న్యాస్ సర్వేలో మూడు తరగతుల్లో జిల్లా అత్యున్నతస్థాయిలో ఉందన్నారు. మర్కజీ పాఠశాల విద్యార్థులు సంస్కృతిక కార్యాక్రమాలు ప్రదర్శించారు. వల్సపైడి వాఖ్యాతగా వ్యవహరించగా, సమావేశంలో మైనార్టీ కమిషన్ సభ్యుడు దర్శన్‌సింగ్, కార్పొరేటర్ ఏనుగుల మానస, డీఐఈఓ గోపాల్, ఎంఈఓ నెహ్రూనాయక్ . డీసీఈబీ సెక్రటరీ డాక్టర్ బి.రాంధన్ పాల్గొన్నారు.
గురువులు ఆరాధ్య దైవాలు :
మేయర్ గుండు సుధారాణి
ఖిలా వరంగల్: గురువులు ఆరాధ్యదైవాలని, దేశ భవిష్యత్ తీర్చిదిద్దే మార్గదర్శకులని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా వరంగల్ ఉర్సుగుట్టలోని ఓ కన్వెన్షన్‌హాల్‌లో కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన శుక్రవారం ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ సారయ్య, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్‌తో కలిసి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. రూ.21వేల కోట్లతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. గురువులు నేర్పిన విద్యతోనే ఈస్థాయికి ఎదిగామన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలలు, విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందని అన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ ఉపాధ్యాయులు భావితరాల నిర్మాతలని, వారి చేతుల్లోనే విద్యార్థులు, సమాజ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అన్నారు. ఆనంతరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 68 మందికి అతిథుల చేతుల మీదుగా జ్ఞాపికలు, ప్రశంసపత్రాలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. వేడుకల్లో డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఈఓ రంగయ్యనాయుడు. ఎంఈఓలు, సమగ్రశిక్షణ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
హనుమకొండలో తొలి జాబితాను
సవరించి రెండో జాబితా
సంఘాల ప్రాతినిథ్యంతో మూడో జాబితా
శాసనమండలి డిప్యూటి చైర్మన్
డాక్టర్‌బండా ప్రకాశ్
జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం

విద్యార్థుల భవిష్యత్ గురువుల చేతుల్లోనే..