
ఘనంగా త్రిశూల స్నానం
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో శుక్రవారం దేవాలయంలోని ప్రాచీన కోనేటిలో పంచలోహ ఉత్తిష్ట గణపతికి త్రిశూల స్నానం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, సందీప్‌శర్మ, ప్రణవ్ మూల మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తిష్ట గణపతిని, గౌరీ గణపతిని పల్లకిలో ప్రతిష్టించి నగరంలో ఊరేగింపుగా తీసుకెళ్లి వచ్చి ప్రాచీన కోనేరు జలంలో త్రిశూల తీర్థోత్సవం ఉత్తిష్టగణపతికి పంచసూక్తవిధానంతో అవబృధస్నానం జలాధివాసం నిర్వహించారు. గౌరీగణపతిని నిమజ్జనం చేశారు. అనంతరం ఉత్తిష్ట గణపతిని తిరిగి రుద్రేశ్వరుడి సన్ని ధిలో ప్రతిష్టించారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు. సాయంత్రం గణపతి ఉత్సవ విగ్రహాన్ని సిద్ధేశ్వర గుండంలో నిమజ్జనం చేశారు.