
వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి కృషి
హన్మకొండ కల్చరల్: కల్యాణ మండపం పునర్నిర్మాణానికి తోడ్పాటునందించానని, వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి నిధులు వచ్చేలా కృషి చేస్తానని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. వేయిస్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలుగా నిలిచిన కళాకారులకు గురువారం రాత్రి బహుమతులు ప్రదానం చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బండా ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.