
ఎస్సార్‌లో అంతర్జాతీయ విద్యామేళా
హసన్‌పర్తి: నగర శివారులోని ఎస్సార్ యూనివర్సిటీలో అంతర్జాతీయ విద్యా మేళా–2025 నిర్వహించారు. ఎస్సార్ ఐ ఎక్స్ ఆడిటోరియంలో బుధవారం ఈకార్యక్రమం జరిగింది. యూనివర్సిటీ హబ్, అబాకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అడ్వయిజర్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎస్సార్ యూనివర్సిటీ వీసీ దీపక్‌గార్గ్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈమేళాలో అమెరికా, యూకే, యూరప్, కెనడా, న్యూజిలాండ్ దేశాలకు చెందిన సుమారు 30 యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. 2,500 మంది విద్యార్థులు హాజరై ఉన్నత విద్య అవకాశాలు, స్కాలర్‌షిప్స్, గ్లోబల్ కెరీర్ మార్గాలు, అడ్మిషన్, వీసా ప్రక్రియ గురించి తెలుసుకున్నారు. నార్త్ ఈస్టర్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, సిటీ యూనివర్సిటీ ఆఫ్ సియాటిల్, వెబ్‌స్టర్ యూనివర్సిటీ, నయాగరా యూనివర్సిటీ, జావియర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వైకాటో, యూనివర్సిటీ కాటోలికా డెల్ సాక్రో కుటర్, డబ్ల్యూసీఐ, గానస్ యూనివర్సిటీ, రేవన్స్‌బోర్స్ యూనివర్సిటీ లండన్, తదితర యూనివర్సిటీలకు చెందిన ప్రతినిధులతో పాటు ఇంటర్నేషనల్ ఎఫైర్స్ అండ్ కార్పొరేట్ ఔట్‌రీచ్ డైరెక్టర్‌ప్రతినిధి ప్రీతా చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.