
7న ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–15 చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–15 చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వహణ కార్యదర్శి పి. కన్నా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ పబ్లిక్‌గార్డెన్ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జనవరి 01, 2010, ఆ తర్వాత జన్మించిన వారు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఇందులో గెలుపొందిన నలుగురు బాలురు, నలుగురు బాలికలు అక్టోబర్‌లో నిజామాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ వెంట చెస్ బోర్డు తెచ్చుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 90595 22986 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
అక్షిత్‌చౌహాన్‌కు అంతర్జాతీయ రేటింగ్
హనుమకొండ రాంనగర్‌కు చెందిన ఆరేళ్ల లావుడ్య అక్షిత్ చౌహాన్ అంతర్జాతీయ చదరంగం రేటింగ్ సాధించాడు. గత నెలలో నాగ్‌పూర్‌లో జరిగిన 1,700 అంతర్జాతీయ ఫిడే రేటింగ్‌లో పాల్గొని 1,439 రేటింగ్ సాధించినట్లు జిల్లా చదరంగ సమైఖ్య బాధ్యుడు పి. కన్నా తెలిపారు. అక్షిత్ చౌహాన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో మొదటి తరగతి చదువుతున్నాడు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు శశికాంత్, అఖిలానాయక్ హర్షం వ్యక్తం చేశారు.