గురువారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

Sep 4 2025 5:39 AM | Updated on Sep 4 2025 5:39 AM

గురువ

గురువారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

నిబంధనలు పాటించాలి

న్యూస్‌రీల్‌

నగరంలో తిరిగే అన్ని రకాల వాహనాలకు..

ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా...

వినాయక నిమజ్జన వాహనాలకు ట్రాఫిక్‌ ఆంక్షలు

గ్రేటర్‌ పరిధిలో చకచకా ఏర్పాట్లు

రేపు (శుక్రవారం) గణపతుల నిమజ్జనం

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

వేయిస్తంభాల ఆలయంలో సింహగణపతిగా అలంకరణ

హన్మకొండ కల్చరల్‌: వేయిస్తంభాల ఆలయంలో బుధవారం మూల మహా గణపతిని శ్రీసింహగణపతిగా అలంకరించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు మూల గణపతికి సింధువర్ణాభిషేకం జరిపి సింహగణపతిగా అలంకరించి, పల్లకిసేవ నిర్వహించారు. సాయంత్రం నృత్యగురువు పిండి సుభాషిణి శిష్య బృంద కూచిపూడి నృత్యాలు అలరించాయి. ఈఓ అనిల్‌కుమార్‌ ఏర్పాట్లు పర్యవేక్షించారు.

6న జరగాల్సిన ఎల్‌ఎల్‌బీ

పరీక్షలు వాయిదా

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిఽధిలో ఈనెల 6న జరగాల్సిన ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సు రెండో సెమిస్టర్‌ పరీక్షలు మూడో పేపర్‌, ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల లా కోర్సు ఆరో సెమిస్టర్‌ మూడో పేపర్‌ పరీక్షలు గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఆసిం ఇక్బాల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా పరీక్షలు ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు. మిగతా పరీక్షల్లో ఎలాంటి మార్పులు లేవని, విద్యార్థులు గమనించాలని సూచించారు. వివరాలకు కేయూ వెబ్‌సైట్‌ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ.ఇన్‌’లో చూడవచ్చని తెలిపారు.

ముగిసిన సీఓఈ ప్రవేశ పరీక్ష

న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ గురుకులాల ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రెండు సీఓఈ (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌)లో ప్రవేశానికి వరంగల్‌ నగరంలోని రంగశాయిపేట శివారు జక్కలొద్ది, కేయూ క్రాస్‌రోడ్డులోని గురుకులాల్లోని రెండు కేంద్రాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్ష బుధవారం ముగిసినట్లు రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ జే.సతీష్‌ తెలిపారు. ఐఐటీ కోసం 164 మంది దరఖాస్తు చేసుకోగా, ఏడుగురు గైర్హాజరయ్యారని, 157 మంది పరీక్షలో ఉత్తీర్ణత సాధించారన్నారు. నీట్‌ కోసం 96 మంది దరఖాస్తు చేసుకొని పరీక్షకు హాజరు కాగా, ఏడుగురు గైర్హాజరయ్యారని వివరించారు. పరీక్షకు హాజరైన వారిలో 89 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.

టీజీ ఎన్పీడీసీఎల్‌ చీఫ్‌ విజిలెన్స్‌

ఆఫీసర్‌గా బోనాల కిషన్‌

హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్‌ చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌గా బోనాల కిషన్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీసు శాఖ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన బోనాల కిషన్‌ను ఎన్పీడీసీఎల్‌ చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌గా నియమిస్తూ ట్రాన్స్‌ కో చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణ భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండలోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరణ అనంతరం ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

కేయూ విద్యా కళాశాల

ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌గా రిజిస్ట్రార్‌

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని విద్యా కళాశాల ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌, విభాగాధిపతిగా రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆకళాశాలలో రెగ్యులర్‌ ఆచార్యులు ఎవరూ లేక ఇన్నాళ్లు హిస్టరీ విభాగం ప్రొఫెసర్‌ ఆచార్య టి.మనోహర్‌ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌, హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

విద్యారణ్యపురి: అడ్మిషన్ల ప్రక్రియలో జూనియర్‌ కళాశాలలు ఇంటర్‌ బోర్డు నియమ నిబంధనలను పాటించాలని వరంగల్‌ డీఐఈఓ డాక్టర్‌ శ్రీధర్‌సుమన్‌ కోరారు. వరంగల్‌ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్‌ కళాశాలలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. దరఖాస్తులు, టీసీలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ ఇంటర్‌బోర్డు ఆదేశాల మేరకు ఇంటర్‌ అడ్మిషన్లకు టీసీ తప్పనిసరి అన్నారు. నిబంధనలను పాటించని కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌, అభ్యసన తరగతులు నిర్వహించాలన్నారు. కళాశాలల్లో రోజువారీ హాజరు, అంతర్గత పరీక్షలు, ప్రమాణాల పెంపుపై పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ఇంటర్‌ అడ్మిషన్ల లాగిన్‌లో విద్యార్థుల వివరాలు, ఫొటో, సంతకం, యూడైస్‌ పెన్‌ నంబర్‌ తదితర వివరాలను నవీకరించాలని పేర్కొన్నారు.

సంపూర్ణ చంద్రగ్రహణం ఆదివారం సంభవిస్తున్నందున, గురువారంతో నవరాత్రులు పూర్తవుతున్నందున వారంతో సంబంధంలేకుండా గణపతుల నిమజ్జనం రేపు (శుక్రవారం) నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రేటర్‌ వరంగల్‌లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్ర గ్రహణం కారణంగా దేవాలయాల్లో ఆదివారం మధ్యాహ్నం 12గంటల్లోపు నివేదనలు జరిపి మూసివేసి, తిరిగి సోమవారం ఉదయం సంప్రోక్షణలు నిర్వహించిన అనంతరం యథావిధి పూజాకార్యక్రమాలు జరుపుకోవాలని రాష్ట్ర అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్రశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, నిమజ్జనం సందర్భంగా గ్రేటర్‌ వరంగల్‌ పరిధి పలురూట్లలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. అదేవిధంగా విగ్రహాలు నిమజ్జనం చేసే చెరువులు, రూట్లలో పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మతులు, ఇతర సదుపాయాల నిమిత్తం ప్రత్యేక అధికారులను నియమిస్తూ బల్దియా కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ నగరంలో బయోగ్యాస్‌ ప్లాంట్ల నిర్మాణాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాలని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ ఎఫైర్స్‌ (ఎన్‌ఐయూఏ) సెక్రటరీ నితేష్‌ అనిరుత సూచించారు. బుధవారం ఢిల్లీనుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్‌నుంచి బల్దియా కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా నితేష్‌ అనిరుత మాట్లాడుతూ నగరంలో కంప్రెషెడ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ (సీబీజీ) ఏర్పాటు కోసం డీపీఆర్‌ సిద్ధం చేయాలన్నారు. దీనిపై కమిషనర్‌ బాజ్‌పాయ్‌ స్పందిస్తూ నగరంలో రెండు బయోగ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరిన్ని ప్లాంట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని తెలిపారు. వీసీలో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

శానిటేషన్‌ నిర్వహణ పక్కాగా జరగాలి

నగరంలో శానిటేషన్‌ నిర్వహణ పక్కాగా జరగాలని బల్దియా కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్‌ హల్‌లో ప్రజారోగ్యం, శానిటేషన్‌ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. కార్మికులు, స్వచ్ఛ ఆటో డ్రైవర్లు, వాహనాలు, రోజూ ఇంటింటా చెత్త సేకరణ, తరలింపు తదితర అంశాలపై సీరియస్‌గా దృష్టి సారించాలన్నారు.

ములుగు, పరకాల వైపు నుంచి వచ్చే బస్సులు వయా పెద్దమ్మగడ్డ నుంచి కేయూసీ, సీపీఓ, అంబేడ్కర్‌ సెంటర్‌, ఏషియన్‌ శ్రీదేవి మాల్‌ మీదుగా బస్టాండ్‌ చేరుకోవాలి.

హనుమకొండ బస్టాండ్‌ నుంచి బయల్దేరి ములుగు, కరీంనగర్‌ వెళ్లాల్సిన బస్సులు వయా ఏషియన్‌ శ్రీదేవి మాల్‌, అంబేడ్కర్‌ సెంటర్‌, సీపీఓ ద్వారా కేయూసీ జంక్షన్‌ మీదుగా వెళ్లాలి.

హనుమకొండ బస్టాండ్‌ నుంచి బయల్దేరి నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రూరు, ఖమ్మం వైపు వెళ్లే బస్సులు వయా బాలసముద్రం, అదాలత్‌, హంటర్‌ రోడ్డు మీదుగా వెళ్లాలి.

వరంగల్‌ బస్టాండ్‌ నుంచి హనుమకొండ వైపు వచ్చే బస్సులు చింతల్‌బ్రిడ్జి నుంచి రంగశాయిపేట మీదుగా నాయుడు పెట్రోల్‌ పంప్‌ సెంటర్‌, ఉర్సు గుట్ట, అదాలత్‌, బాలసముద్రం మీదుగా హనుమకొండకు చేరుకోవాలి.

కాజీపేట నుంచి వరంగల్‌ వైపు వెళ్లాల్సిన కార్లు, ఇతర చిన్న వాహనాలు ఫాతిమా జంక్షన్‌, వడ్డ్డేపల్లి చర్చి, కేయూసీ జంక్షన్‌, పెద్దమ్మగడ్డ, ములుగు రోడ్డు, ఎంజీఎం, జెమిని, పోతన జంక్షన్‌, అండర్‌ బ్రిడ్జి, హెడ్‌ పోస్టాఫీస్‌, వరంగల్‌ బస్టాండ్‌, వెంకట్రామ మీదుగా ప్రయాణించాలి.

వరంగల్‌ నుంచి కాజీపేట వైపు వెళ్లాల్సిన వాహనాలు వెంకట్రామ, వరంగల్‌ బస్టాండ్‌, హెడ్‌ పోస్టాఫీస్‌, అండర్‌ బ్రిడ్జి, పోతన జంక్షన్‌, జెమిని, ఎంజీఎం, ములుగు రోడ్డు, పెద్దమ్మగడ్డ, కేయూసీ జంక్షన్‌, వడ్డ్డేపల్లి చర్చి, ఫాతిమా జంక్షన్‌ మీదుగా ప్రయాణించాలి.

బయోగ్యాస్‌ ప్లాంట్లను నిర్మించండి

ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో

ఎన్‌ఐయూఏ సెక్రటరీ నితేష్‌ అనిరుత

6న సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగులకు క్రీడా పోటీలు

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఈనెల 6న నగరంలోని జేఎన్‌ఎస్‌లో ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్‌ఓ గుగులోతు అశోక్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. 6న ఉదయం 8గంటలకు ఐడెంటిటీ కార్డు, ప్రస్తుత సర్వీస్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు. మహిళలు, పురుషులకు అథ్లెటిక్స్‌, బాస్కెట్‌బాల్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, చెస్‌, క్యారమ్స్‌, హాకీ, కబడ్డీ, లాన్‌టెన్నిస్‌, పవర్‌ లిఫ్టింగ్‌, స్విమ్మింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, వాలీబాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌, బెస్ట్‌ ఫిజిక్‌, యోగా, ఖోఖో క్రీడాంశాల్లో, పురుషులకు క్రికెట్‌ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు 9, 10వ తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పూర్తి వివరాలకు డీఎస్‌ఏ అథ్లెటిక్స్‌ కోచ్‌ శ్రీమన్నారాయణ 94410 86556 లో సంప్రదించాలని పేర్కొన్నారు.

7న ఉద్యోగులకు జిల్లాస్థాయి పోటీలు

న్యూశాయంపేట: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ ఆదేశాల మేరకు ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీసెస్‌ టోర్నమెంట్‌ (ఏఐసీఎస్‌)లో పాల్గొనేందుకు ఈనెల 7న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లాస్థాయి క్రీడాపోటీలు నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు వరంగల్‌ జిల్లా యువజన, క్రీడల అధికారి టీవీఎల్‌.సత్యవాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌ ఓసిటీ స్టేడియంలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్‌ ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగల ఉద్యోగులు ఐడీ కార్డు, ఆధార్‌కార్డు, క్రీడాసామగ్రి వెంట తెచ్చుకోవాలని సూచించారు. 19 క్రీడాంశాల్లో ఎంపిక పోటీలు ఉంటాయని తెలిపారు. వివరాలకు ఓసిటీలోని కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

వరంగల్‌ క్రైం: వినాయక నిమజ్జనం సందర్భంగా ఈనెల 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు వరంగల్‌ ట్రై సిటీ పరిధిలో భారీ వాహనాలకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ బుధవారం వెల్లడించారు. ఈ మేరకు ట్రాఫిక్‌ మళ్లింపు వివరాలను మీడియాకు వెల్లడించారు. నిమజ్జనం రోజున శోభాయాత్ర వెళ్లే మార్గంలో, నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో వాహనాలు రోడ్డుపై నిలుపరాదని, ఈ విషయంలో ప్రజలు ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.

ములుగు – భూపాలపల్లివైపు నుంచి వచ్చే భారీ వాహనాలు హైదరాబాద్‌కు ఆరెపల్లి వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డునుంచి వెళ్లాలి.

భూపాలపల్లి – పరకాల నుంచి ఖమ్మం వెళ్లాల్సినవి ఆరెపల్లి వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎక్కి కరుణాపురం– వెంకటాపురం–ఐనవోలు–పున్నేలు క్రాస్‌ రోడ్డు మీదుగా ఖమ్మం రోడ్డు ఎక్కి వెళ్లాలి.

భూపాలపల్లి – పరకాల నుంచి వచ్చే వాహనాలు నర్సంపేట వైపునకు కొత్తపేట – రెడ్డిపాలెం – జాన్‌పీరీలు– గొర్రెకుంట నుంచి వెళ్లాలి.

కరీంనగర్‌ నుంచి ఖమ్మం వైపు వెళ్లే భారీ వాహనాలు చింతగట్లు వద్ద ఓఆర్‌ఆర్‌ ఎక్కి యూటర్న్‌ తీసుకొని కరుణాపురం – వెంకటాపూర్‌ – ఐనవోలు– పున్నేలు క్రాస్‌ రోడ్డు వద్ద ఖమ్మం రోడ్డు ఎక్కి వెళ్లాలి.

ఖమ్మం నుంచి కరీంనగర్‌ – హైదరాబాద్‌ వైపు వెళ్లే భారీ వాహనాలు పున్నేలు క్రాస్‌ రోడ్డు– ఐనవోలు ఆర్చి–వెంకటపూర్‌– కరుణాపురం మీదుగా వెళ్లాలి.

హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వెళ్లే భారీ వాహనాలు కరుణాపురం – వెంకటాపూర్‌–ఐనవోలు– పున్నేలు క్రాస్‌ రోడ్డు నుంచి ఖమ్మం వెళ్లాలి.

నిమజ్జన సమయంలో సిటీ లోపలికి భారీ వాహనాలకు అనుమతి లేదని, నగరం అవతలే నిలుపుకోవాలి.

హైదరాబాద్‌ నుంచి నర్సంపేట వైపు వెళ్లే భారీ వాహనాలు కరుణాపురం నుంచి ఓఆర్‌ఆర్‌ మీదుగా వచ్చి ఆరెపల్లి వద్ద దిగి కొత్తపేట– రెడ్డిపాలెం – జాన్‌పీరీలు– గొర్రెకుంట మీదుగా వెళ్లాలి.

నర్సంపేట వైపు నుంచి హైదరాబాద్‌ వెళ్లే భారీ వాహనాలు గొర్రెకుంట – జాన్‌పీరీలు– రెడ్డిపాలెం– కొత్తపేట – ఓఆర్‌ఆర్‌ మీదుగా ప్రయాణించాలి.

సిద్ధేశ్వర గుండంలో నిమజ్జనం చేసిన తర్వాత వాహనాలు శాయంపేట వైపు వెళ్లే రోడ్డు ద్వారా ఎగ్జిట్‌ అవ్వాలి.

శాయంపేట వైపు నుంచి వచ్చే వినాయక విగ్రహ వాహనాలు వయా హంటర్‌రోడ్డు, అదాలత్‌, హనుమకొండ చౌరస్తా మీదుగా ప్రయాణించాలి.

ఎకై ్సజ్‌ కాలనీ, రెవెన్యూ కాలనీ, వడ్డేపల్లి ప్రాంతాల నుంచి వచ్చే వినాయక విగ్రహాలు అన్ని బంధం చెరువులో నిమజ్జనం చేయాలి.

చిన్నవడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేసిన వాహనాలు ఏనుమాముల రోడ్డు నుంచి నర్సంపేట రోడ్డు వైపునకు వెళ్లాలి.

గురువారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 20251
1/4

గురువారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

గురువారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 20252
2/4

గురువారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

గురువారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 20253
3/4

గురువారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

గురువారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 20254
4/4

గురువారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement