
కమిషనరేట్‌కు అధికారులు
వరంగల్ క్రైం: రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌శాఖలో జరిగిన బదిలీల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు ఇద్దరు, భూపాలపల్లికి ఒకరు వచ్చారు. రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఖమ్మం అడిషనల్ డీసీపీగా పనిచేస్తున్న ఏ.నరేశ్‌కుమార్ భూపాపల్లి అడిషనల్ ఎస్పీగా, భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్‌ను వరంగల్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీగా (ఆపరేషన్ అండ్ క్రైం), ఆసిఫాబాద్‌లో అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రాయల్‌ప్రభాకర్‌రావును వరంగల్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ ( లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్)కు బదిలీ చేశారు.