ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలి : కలెక్టర్
సాక్షి, వరంగల్: జిల్లాలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) కింద ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్స్ త్వరగా జారీ చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్‌లో ఎల్‌ఆర్‌ఎస్, భూగర్భ జలాల పరిరక్షణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌డీఓ కౌసల్యాదేవితో కలిసి బుధవారం ఆమె సమీక్ష చేశారు. 25 శాతం రాయితీతో ఈనెల 30 వరకు చివరి గడువు ఉన్నందున ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు.
ఇంకుడు గుంతల వివరాలు సేకరించాలి..
జిల్లాలో భూగర్భ జలాలను పెంపొందించడంలో భాగంగా ప్రతి 200 చదరపు మీటర్లకు పైన ఉన్న ఇళ్ల్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఇంకుడు గుంతల వివరాలు సేకరించి నివేదికలు వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని, ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు.
పారదర్శకంగా వెరిఫికేషన్ చేయాలి
పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల్ల వెరిఫికేషన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్‌స హాల్‌లో ఇందిరమ్మ ఇళ్ల్ల వెరిఫికేషన్ అధికారులకు బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఐడీ కార్డులు, క్యాపులు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 11 మండలాలతో పాటు మున్సిపాలిటీలకు 86 మంది వెరి ఫికేషన్ అధికారులను నియమించినట్లు తెలిపారు.
మాట్లాడుతున్న వరంగల్ కలెక్టర్ సత్యశారద


