సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో వరంగల్‌ జట్టుకు మూడో స్థానం | - | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో వరంగల్‌ జట్టుకు మూడో స్థానం

Dec 29 2025 10:49 AM | Updated on Dec 29 2025 10:49 AM

సాఫ్ట

సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో వరంగల్‌ జట్టుకు మూడో స్థానం

యాప్‌ను సమర్థంగా అమలు చేయండి ●వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

మందమర్రి రూరల్‌: మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌ మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో మహబూబ్‌నగర్‌ విజేతగా నిలిచింది. ఫైనల్‌ లో 3–2 స్కోర్‌ తేడాతో మహబూబ్‌నగర్‌ గెలుపొందగా నిజామాబాద్‌ జట్టు రెండో స్థానం దక్కించుకుంది. వరంగల్‌, ఆదిలాబాద్‌ జట్లు తలపడగా 9–8స్కోర్‌ తేడాతో వరంగల్‌ జట్టు గెలిచి మూడో స్థానంలో నిలిచింది. గెలిచిన జట్లకు ఒలింపిక్‌ జిల్లా కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి బాబురావు, డీఐఈఓ అంజయ్య బహుమతులు, మెడల్స్‌ ప్రదానం చేశారు. అనంతరం రాష్ట్రస్థాయి జట్టును ఎంపిక చేశారు.

న్యూశాయంపేట: వరంగల్‌ జిల్లాలో యూరియా యాప్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని ఆ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌ నుంచి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. యాప్‌ నిర్వహణలో వ్యవసాయ శాఖ, ఎరువుల డీలర్ల పాత్రను వివరించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న రైతులు ముందుగా గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఫర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌ అని టైప్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సొంత భూమిలో సాగు చేస్తున్న రైతులు, కౌలు రైతులు, తదితర రైతులు తమ సెల్‌ఫోన్‌, ఆధార్‌ నంబర్‌ ద్వారా లాగిన్‌ అయి యాసంగి 2025–26లో సాగు చేయనున్న పంట వివరాలు నమోదు చేయాలి. పంట వివరాలు నమోదు చేసిన అనంతరం జిల్లాలోని ఎరువుల డీలర్ల వద్ద జాబితా, వారి వద్ద అందుబాటులో ఉన్న యూరియా బస్తాల వివరాలు యాప్‌లో కనిపిస్తాయి. సాగుకు అవసరమైన యూరియాను దఫాల వారీగా బుక్‌ చేసుకునే అవకాశం ఉందన్నారు. యూరియా బుకింగ్‌ అనంతరం రైతుకు ఒక బుకింగ్‌ ఐడీ నంబర్‌ వస్తుందని, ఆ ఐడీ నంబర్‌తో పాటు ఆధార్‌, పట్టాదారు పాస్‌బుక్‌ తీసుకుని సమీప డీలర్‌ వద్ద యూరియా పొందవచ్చన్నారు. అయితే యూరియా స్లాట్‌ బుకింగ్‌కు సంబంధించి బుకింగ్‌ ఐడీ కేవలం 24 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుందన్నారు. యాప్‌ ద్వారా యూరియా స్లాట్‌ బుకింగ్‌ సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఏడీఏలు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.

జవనరి ఫస్ట్‌.. కార్యాలయం షిఫ్ట్‌

కాజీపేట ఏసీపీ కార్యాలయం తరలింపు

● అద్దె భవనం నుంచి సర్కారు భవనంలోకి...

హసన్‌పర్తి: కాజీపేట ఏసీపీ కార్యాలయం తరలింపునకు సిద్ధమైంది. ప్రస్తుతం హంటర్‌రోడ్డులో నిర్వహిస్తున్న ఈకార్యాలయాన్ని సర్కార్‌ భవనంలోకి తరలించే కార్యక్రమం చేపట్టారు. హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌పై ఉన్న గదిలోకి ఈ భవనం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇప్పటికే అద్దె భవనాల కిరాయిలు ఫిబ్రవరి నుంచి నిలిపేయాలని సర్కార్‌ ట్రెజరీలను ఆదేశించింది. ఈ నేపథ్యంతో సర్కార్‌ కార్యాలయాలను సొంత భవనాల్లోకి మార్చడానికి జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఏసీపీ కార్యాలయాన్ని సొంత భవనంలోకి షిప్ట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం కాజీపేట ఏసీపీ కార్యాలయం పరిధిలో కాజీపేట, ఽహసన్‌పర్తి, మడికొండ, ధర్మసాగర్‌, వేలేరు, భీమదేవరపల్లి, వంగర, ఎల్కతుర్తి, కమలాపూర్‌ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. 30 ఏళ్లుగా అద్దె భవనంలోనే ఈకా ర్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. కమిషనరేట్‌ కంటే ముందు వరంగల్‌ రూరల్‌ డీఎస్పీ కార్యాలయంగా కొనసాగింది. కమిషనరేట్‌ ఏర్పాటు తర్వాత వరంగల్‌ రూరల్‌ డీఎస్పీ కార్యాలయాన్ని కాజీపేట కమిషనరేట్‌గా మార్చారు. జనవరి ఫస్ట్‌ నుంచి ఏసీపీ కార్యాలయ కార్యకలాపాలు పూర్తిగా హసన్‌పర్తి నుంచి కొనసాగనున్నాయి. తాత్కాలికంగా ఏసీపీ కార్యాలయం కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటీకే పోలీస్‌స్టేషన్‌పై అంతస్తులోని భవనాన్ని ముస్తాబు చేస్తున్నారు.

సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో వరంగల్‌ జట్టుకు మూడో స్థానం1
1/1

సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో వరంగల్‌ జట్టుకు మూడో స్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement