
పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం ఎన్నిక
రామన్నపేట : వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా ఈ.వీ. శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శిగా మేకల అక్షయ్‌కుమార్, కోశాధికారిగా పడిశాల ఆనంద్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళా శాల పూర్వ విద్యార్థుల సంఘం స్వరసభ్య సమావేశాన్ని ఆదివారం కళాశాల ఆవరణలో నిర్వహించా రు. ఈ సందర్భగా ఐదేళ్ల కాలానికి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం సీనియర్ సలహాదారులు గా సుధాకర్‌రెడ్డి, స్వామి, ప్రకాశ్, రాంబ్రహ్మం, కొండల్‌రావు, రాఘవులు, ఎల్లయ్య, ఉమేందర్ సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 70 సంవత్సరాల పాలిటెక్నిక్ కళాశాలకు అధ్యక్ష బాధ్యతలు పొందడం సంతోషంగా ఉందన్నారు. బొద్దిరెడ్డి సతీష్‌రెడ్డి, రాజ్‌కుమార్, భిక్షపతి, ధర్మ శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్, శ్రీనివాస్‌రావు, వసంత్‌కుమార్, మధు, అజీజ్, శ్రీవిద్య, జయశ్రీ, గిరివర్మ, దొడ్డిపల్లి కుమార్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
హన్మకొండ కల్చరల్ : మున్నూరు కాపు పరపతి సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం హనుమకొండ పద్మాక్షి రోడ్‌లోని మున్నూరు కాపు పరపతి సంఘం కార్యాలయంలో ఎన్నుకున్నారు. సంఘం 41వ వార్షిక సర్వసభ్య సమావేశంలో.. సంఘం అధ్యక్షుడిగా తోటప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా కనుకుంట్ల రవికుమార్, కోశాధికారిగా బొల్లం అశోక్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా బండారి మహేందర్, సహా యకార్యదర్శిగా పోలు లక్ష్మణ్, ఆడిటర్‌గా గందె మధు, కార్యవర్గ సభ్యులుగా కనుకుంట్ల శ్రీనివాస్, యావశెట్టి లక్ష్మణ్, కర్రు మనోజ్‌కుమార్, రాకేష్, రే వంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్పొరేటర్ తో ట వెంకటేశ్వర్లు, గందె కృష్ణ, అంబటి కుమారస్వామి, పొటి శ్రీనివాస్, కర్రె సుదర్శన్ పాల్గొన్నారు.