
సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌పై అవగాహన కల్పించండి
బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
వరంగల్ అర్బన్ : స్వచ్ఛ సర్వేక్షణ్–2024 పోటీల్లో ఫీడ్ బ్యాక్ (ప్రజాభిప్రాయం) విస్తృతంగా అందించేలా ప్రచారం చేయాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. శుక్రవారం మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లు (సీఓ)లతో బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్–2024 సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో నగరానికి ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రజలను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందన్నాఉ. ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 31తో 25శాతం రిబేట్ ముగుస్తున్నందున సద్వినియోగం చేసుకునేలా ఆర్పీలు ఫోన్ల ద్వారా సమాచారం అందించాలని కోరారు. ఆస్తి, నల్లా పన్నులకు చెల్లించని వారికి రెడ్ నోటీసులు అందజేసి చెల్లించేలా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ (అడ్మిన్) రాజేశ్వరరావు, టీఎంసీ రమేష్, సీఓలు సఫియా, శ్రీలత, సకినాల రమేష్, స్వాతి, అలీ తదితరులు పాల్గొన్నారు.