బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025
అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టమ్
చిన్న పట్టణాలు, నగరాల్లో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) సిస్టమ్ ఉంది. వరంగల్ మహా నగరంలో మాత్రం కలగానే మిగిలింది. 1996లో రూ.1,500 కోట్లతో రూపకల్పన చేసిన ప్రతిపాదనలు 2022 నాటికి రివైజ్డ్‌గా రూ.2,400కోట్లకు పెరిగింది. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం రూ.4170 కోట్లు మంజూరు చేసినా ఆ మేరకు నిధులు కేటాయించలేదు.
కాకతీయ మెగా జౌళి పార్కుకు రాష్ట్ర ప్రభుత్వం 1,200 ఎకరాల భూసేకరణ చేసి, టీజీఐఐసీ ద్వారా మౌలిక వసతులు కల్పించింది. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు పని మొదలు పెట్టినా... కేంద్రంనుంచి పీఎం మిత్ర కింద రూ.200 కోట్లు రాబట్టేందుకు ’ఎస్‌పీవీ’(ప్రత్యేక ప్రయోజన వాహకం) ఏర్పాటు చేయడంతోపాటు రూ.500 కోట్లు కేటాయించాల్సి ఉంది.