హన్మకొండ అర్బన్ : తలసేమియా బాధిత పిల్లల కోసం నేడు(మంగళవారం) హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం ఐడీఓసీ మొదటి అంతస్తు ఎఫ్–1లోని జిల్లా ట్రెజరీ కార్యాలయ ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్న ట్లు డీటీఓ ఆకవరం శ్రీనివాస్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధికారులు, టీజీఓస్, టీఎన్జీఓస్, డీఆర్‌డీఏ, ట్రెసా, క్లాస్–4, అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు, బా ధ్యులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు
309 మంది గైర్హాజరు
సాక్షి వరంగల్: వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు కొనసాగాయి. జనరల్ కోర్సుకు 5,568 మందికిగాను 5,342 మంది విద్యార్థులు హాజ రయ్యారు. 226 మంది విద్యార్థులు గైర్హాజరైన ట్లు ఇంటర్ విద్యాధికారి శ్రీధర్‌సుమన్ తెలిపా రు. ఒకేషనల్ విద్యార్థులు 939 మంది కాగా 856 మంది పరీక్షకు హాజ రవ్వగా 83మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
టెక్నికల్ ఉద్యోగుల
సంఘం ఎన్నికలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 28న నిర్వహిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం పలువు రు నామినేషన్లను దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి డాక్టర్ పుల్లా శ్రీనివాస్, జనరల్ సెక్రటరీగా ఎన్.రాము, ఉపాధ్యక్షుడిగా మెట్టు రవి, జాయింట్ సెక్రటరీ(ఆర్గనైజేషన్)గా వై.రవికుమార్, జాయింట్ సెక్రటరీ రిక్రియేషన్‌గా వై.బాబు, కోశాధికారిగా వి.ప్రేమ్‌సాగర్ నామినేషన్లను యూనివర్సిటీ కళాశాల ప్రిన్సి పాల్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి టి.మనోహర్‌కు అందజేశారు. ఈనెల 20వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.
నేటినుంచి జాతీయ సదస్సు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 18, 19 తేదీల్లో రెండ్రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ తుమ్మల రాజమణి తెలిపారు. ‘ఇండియన్ కాన్సిట్యూషన్ మైల్‌స్టోన్స్–ఇష్యూస్ అండ్ చాలెంజెస్’ అనే అంశంపై యూనివర్సిటీ సెనేట్‌హాల్‌లో సదస్సు ఉంటుందని వెల్లడించారు.
క్రైమ్ డీసీపీగా
జనార్దన్ బాధ్యతలు
వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్ డీసీపీగా బి.జనార్దన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్‌లో ఎస్సైగా, ఇన్‌స్పెక్టర్‌గా, ఏసీపీగా పనిచేశారు. క్రైమ్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వరంగల్ సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు
జిల్లా కోర్టు జీపీగా
నర్సింహారావు
వరంగల్ లీగల్ : హనుమకొండ జిల్లా కోర్టు ప్రభుత్వ న్యాయవాది(గవర్నమెంట్ ప్లీడర్)గా కాకిరాల నర్సింహారా వును నియమిస్తూ రాష్ట్ర న్యాయశాఖ వ్యవహా రాలు, న్యాయపాలన సెక్రటరీ ఆర్.తిరుపతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూ రు మండలం కుందూరుకు చెందిన నర్సింహా రావు 33 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు.