
జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
కాజీపేట అర్బన్/ధర్మసాగర్: ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ధర్మసాగర్ మండలానికి చెందిన హనుమకొండలోని హంటర్‌రోడ్డులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను గురువారం కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. ఈసందర్భంగా ఇంటర్ పరీక్షలు ఎలా రాస్తున్నారు? నీట్, ఎంసెట్‌కు దరఖాస్తు చేశారా? అని విద్యార్థినులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 8, 9, 10 తరగతి క్లాస్‌లకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, ఇతర పరీక్ష సామగ్రి అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శైలజ, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య