
కేయూ క్యాంపస్: జాతరలో అమ్మవార్లు, భక్తులకు సేవలందించేందుకు కాకతీయ యూనివర్సిటీ నుంచి జాతీయ సేవాపథకం (ఎన్‌ఎస్‌ఎస్ ) వలంటీర్లు, అధికారులు మేడారం వెళ్లనున్నారు. యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి డిగ్రీ కళాశాలల నుంచి ఎంపిక చేసిన 200 మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, అధికారులు మంగళవారం క్యాంపస్‌లోని ఎన్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి బస్సుల్లో మేడారం వెళ్లనున్నారు. జాతరలో గద్దెలు, జంపన్నవాగు, ఆర్టీసీ బస్సుల క్యూలైన్ల తదితర చోట్ల సేవలు అందించబోతున్నారు. ప్రతి రెండేళ్లొకసారి జరిగే మేడారంలో కేయూ ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు సేవలు అందిస్తున్నారు. ఇందులోభాగంగా 2022లో జరిగిన జాతరకు 400మంది సేవలు అందించారు. అయితే ఈసారి ఎక్కువగా ఆ ప్రాంతంలోని విద్యార్థులను వినియోగించుకుంటున్న నేపథ్యంలో 200మంది మాత్రమే కావాలని సంబంధిత జిల్లా అధికారులు యూనివర్సిటీ అధికారులను కోరారు. దీంతో కేయూ పరిధిలోని డిగ్రీ కళాశాలల నుంచి 200మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, 10మంది ఆఫీసర్లను పంపబోతున్నారు. అయితే పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు అధికారులు మరో వంద మందిని పంపాలని కోరినట్లు సమాచారం. జాతరను వారంరోజుల ప్రత్యేక శిబిరంగా పరిగణిస్తారని కేయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య ఈసం నారాయణ తెలిపారు.
నేడు మేడారానికి ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, అధికారులు
Comments
Please login to add a commentAdd a comment