
మాట్లాడుతున్న కలెక్టర్ సిక్తాపట్నాయక్
హన్మకొండ: ప్రపంచ ‘గుండె’ దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండలోని ఏకశిల హాస్పిట ల్స్ ఆధ్వర్యంలో ఆదివారం మినీ వాకథాన్ (2కే రన్) నిర్వహించారు. ఆస్పత్రి నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు నిర్వహించిన వాకథాన్‌ను డీసీపీ మురళి ప్రారంభించారు. అనంతరం పబ్లిక్‌గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో ‘గుండె సంరక్షణ– ఆరోగ్యకరమైన జీవనశైలి’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సీపీఆర్ శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హాజరై మాట్లాడుతూ.. సీపీఆర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, తద్వారా గుండెపోటుకు గురైన వారిని రక్షించే అవకాశం ఉంటుందన్నారు. వారం రోజులపాటు ప్రజలకు సీపీఆర్‌పై ఉచిత శిక్షణ అందిస్తామని ఏకశిల ఆస్పత్రి చైర్మన్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఈఅవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ మదన్‌మోహన్, ఏకశిల ఆస్పత్రి ఎండీ డాక్టర్ జి.రమేశ్, ఆస్పత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ సంతోశ్ మథానీ, డాక్టర్లు రామకృష్ణారెడ్డి, లలిత, లావణ్య, శివనాగార్జున, ఆసిఫ్, ఇక్బాల్, ఆర్‌ఎంఓ డాక్టర్ వెంకట్‌రెడ్డి, వాగ్దేవి, చైతన్య కళాశాలల విద్యార్థులు వాకథాన్‌లో పాల్గొన్నారు.
కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఏకశిల ఆస్పత్రి ఆధ్వర్యాన మినీ వాకథాన్