
సోమవారం శ్రీ 25 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2023
– 8లోu
వరంగల్ అర్బన్: వరంగల్ ట్రైసిటీలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు చెత్తా చెదారంతో నింపేస్తున్నారు. దీనికితోడు మురికి నీరు, వర్షపు నీరు చేరి మడుగుల మాదిరిగా మారుతున్నాయి. పాత బస్తీల్లో డ్రెయినేజీల్లో వ్యర్థాలు పేరుకుపోయి దోమలు విజృంభిస్తుండగా.. అభివృద్ధి చెందిన కాలనీల్లో యజమానులు స్థలాలను కొనుగోలు చేసి వదిలేస్తుండడంతో ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి దోమలకు కేంద్రాలుగా మారుతున్నాయి. రాత్రీ పగలు తేడా లేకుండా ప్రజల రక్తాన్ని పీల్చుతూ అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. బల్దియా పరిధిలో సుమారు 4,600 వరకు ఖాళీ స్థలాలు ఉన్నాయి. నిత్యం వందల సంఖ్యలో ఫిర్యాదులొస్తున్నా బల్దియా అధికారులు, ఆయా విభాగాల సిబ్బంది నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు.
పత్తా లేని ఫాగింగ్..
దోమల నివారణకు బల్దియా వద్ద ఫాగింగ్ యంత్రాలు, నాలుగు పెద్ద ఆటోలు, నాలుగు చిన్న ఆటోలు, 35 హ్యాండ్ మిషన్లు ఉండే వి. చిన్న మిషన్లు, 10 హ్యాండ్ మిషన్లు మరమ్మతుకు రావడంతో మూలకు చేరాయి. నగర పరిధి 66 డివిజన్లలో షెడ్యూల్ ప్రకారం ఫాగింగ్ చేయాలి. సిబ్బంది ఎక్కడ ఫాగింగ్ చేస్తున్నారో అంతుచిక్కని పరిస్థితి. దోమల నివారణకు బల్దియా ప్రతి నెలా రూ.2.30లక్షల విలువైన ఇంధనాన్ని వెచ్చిస్తోంది. ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర రసాయనాలు, యంత్రాలు తదితరాలకు ఏటా రూ.2.50 కోట్లు వెచ్చిస్తున్నా.. ప్రయోజనం లేకుండా పోతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో పారిశుద్ధ్య సమస్యపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.
న్యూస్‌రీల్
పిచ్చిమొక్కలు, వ్యర్థాలకు నిలయాలుగా ఖాళీ స్థలాలు
పందులు, కుక్కలు, దోమల బెడద
ఫాగింగ్, గ్యాంగ్ వర్క్‌లు అంతంతే..
ప్రతి నెలా ఇంధనానికి రూ.2.30 లక్షలు
అయినా ప్రజలకు తప్పని దోమల బెడద
ముచ్చర్లలో డెంగీతో ఓ యువకుడి మృతి
పక్క ఫొటో గ్రేటర్ వరంగల్ పరిధి 41వ డివిజన్ నాగేంద్రనగర్‌లోనిది. ఇళ్ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో నీరు నిలిచి పందులు, దోమలు, ఈగలకు నిలయంగా మారింది. దోమల నివారణకు బల్దియా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని, ఫాగింగ్ కూడా చేయడం లేదని పరిసరాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఫాగింగ్ చేయడంతో పాటు మురికి నీటిలో ఆయిల్ బాల్స్ వేయాలని, నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
– కరీమాబాద్

