
సీపీటీసీని పరిశీలిస్తున్న సీపీ, అధికారులు
వరంగల్‌క్రైం/మడికొండ : మడికొండ శివారులోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (సీపీటీసీ)లో అవసరమైన వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు. త్వరలో ప్రారంభం కానున్న పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ నేపథ్యంలో సీపీటీసీని బుధవారం కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్‌లోని బ్యారక్‌లు, తరగతి గదులు, భోజనశాల, మరుగుదొడ్లు, పరేడ్ మైదానాన్ని పరిశీలించారు. శిక్షణ కేంద్రాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ట్రైనీ కానిస్టేబుళ్ల కోసం నైపుణ్యం కలిగిన శిక్షకులను నియమించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ రాగ్యానాయక్, ఆరె ఉదయభాస్కర్, ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, దేవేందర్, మడికొండ ఎస్సై రాజబాబు, శిక్షణ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
దరఖాస్తు గడువు పొడిగింపు
న్యూశాయంపేట : మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు అందించే సీఎంఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 25 వరకు గడువు పొడిగించినట్లు వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి హరికృష్ణ బుధవారం తెలిపారు. వివరాలకు 0870–2980533, 9550560175 సంప్రదించాలని సూచించారు.