
వీసీ, రిజిస్ట్రార్ల చిత్రపటాలకు పిండ ప్రదానం చేస్తున్న విద్యార్థులు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్లకు సంబంధించిన రెండో జాబితా విడుదల చేయాలని, ఈ అడ్మిషన్లలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలనే తదితర డిమాండ్లతో 14 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నా వీసీ, రిజిస్ట్రార్లు స్పందించకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం దీక్షల శిబిరం వద్ద వారి చిత్రపటాలకు విద్యార్థి జేఏసీ నాయకులు పిండ ప్రదానం చేసి నిరసన తెలిపారు. వంటవార్పు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసులతో కొట్టించడాన్ని నిరసిస్తూ 14 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నా వీసీ, రిజిస్ట్రార్లు స్పందించడం లేదని మండిపడ్డారు. కాగా, మంగళవారం విద్యార్థి జేఏసీ దీక్షలను పార్ట్‌టైం లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్షుడు సొల్లికిరణ్‌గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ చైర్మన్ తిరుపతియాదవ్, నేతలు గుగులోత్ రాజునాయక్, మేడరంజిత్‌కుమార్, బొట్లమనోహర్, ఆరెగంటి నాగరాజు, మాచర్ల రాంబాబు, అంబాలకిరణ్, మట్టెడ కుమార్, శంకర్, విజయ్‌కన్నా, మొగిలివెంకటరెడ్డి, ఎండీ పాషా, నిమ్మల రాజేష్, బానోత్ లక్‌పతి, గట్టు ప్రశాంత్, కాయిత నాగరాజు, మంగపెల్లి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
కేయూలో కొనసాగుతున్న
విద్యార్థి జేఏసీ దీక్షలు