
వేదికపై రైల్వే అధికారులు, రైల్వే ఎస్సీ, ఎస్టీ నాయకులు
కాజీపేట రూరల్: రైల్వే ఎస్సీ, ఎస్టీ కార్మికులు తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాలని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ సికింద్రాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ బి. వీరన్న అన్నారు. కాజీపేట రైల్వే ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ కార్యాలయంలో మంగళవారం అసోసియేషన్ 65వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో రైల్వే ఎస్సీ, ఎస్టీ కార్మికులు ఐక్యంగా ఉండి హక్కుల సాధనకు కృషి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ఏడీఎస్ కెఎన్.రావు మాట్లాడుతూ సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ ఎ.ఆర్.రాజశేఖర్ సూచనల మేరకు కాజీపేట జంక్షన్‌లో అన్ని బ్రాంచీల నాయకులు కలిసి అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. రైల్వే ఆస్పత్రి డీఎంఓ ధీరజ్‌కుమార్ మాట్లాడుతూ రైల్వే ఎస్సీ, ఎస్టీ కార్మికుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. రైల్వే అధికారులు బి.బాలరాజు, ఆర్.వి.వెంకటేశ్వర్లు, రామారావు, సురమౌలేశ్వర్‌రావు ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై మాట్లాడారు. కార్యక్రమంలో కె.రవీందర్, చింత తిరుపతి, శ్రీనివాస్‌నాయక్, సీనుబాబు, వీరస్వామి, ఎం.ఎ ల్.నారాయణ, ఆర్.కుమారస్వామి, కిషన్, జెగ్డారా వు, ప్రవీణ్, ఎం.శ్రీను, ఎం.నరేష్, ఎం.మోహన్, రామ్మూర్తి, జక్రియా, మీనాలు, కె.సంగమయ్య, కె.వి.రావు, కొండ్ర నర్సింగరావు పాల్గొన్నారు.