
ఈ–కేవైసీపై అవగాహన కల్పిస్తున్న డీఎస్‌ఓ
ఖిలా వరంగల్ : జిల్లాలోని రేషన్ షాపుల్లో రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈ–కేవైసీ నమోదు చేయించుకోవాలని వరంగల్ జిల్లా పౌర సరఫరాల శాఖ అఽధికారి కె.చందన్‌కుమార్ సూచించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఈ–పాస్ టెక్నీషియన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రేషన్‌షాపుల్లో డీలర్లు కార్డుదారులకు తప్పనిసరిగా ఈ–కేవైసీ ఆప్‌డేట్ చేయించాలని ఆదేశించారు. ఈ–కేవైసీ నమోదు ప్రచారంలో భాగంగా వరంగల్ రామన్నపేటలోని 71వ షాపును డిప్యూటీ తహసీల్దార్ కిరణ్‌కుమార్, మండల అధికారులతో కలిసి డీఎస్‌ఓ సందర్శించారు. కార్యక్రమంలో డీలర్ చంద్రమౌళి, కార్డుదారులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సరఫరాల శాఖ అఽధికారి కె.చందన్‌కుమార్